ఇండియా మాజీ క్రికెటర్ మరియు ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన కెరీర్ లో ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించి ఎనలేని సేవలను ఇండియన్ క్రికెట్ కు అందించాడు. ఇక క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికిన అనంతరం కాన్సర్ వ్యాధి తనను ఎంతగానో ఇబ్బంది పెట్టినా తలొంచకుండా మరణాన్ని సైతం ఎదిరించి నిలిచాడు. కాగా యువరాజ్ ఫారిన్ అమ్మాయి అయిన హాజిల్ కీచ్ ను ప్రేమించి 2016 లో పెళ్లాడాడు. ఇక గత సంవత్సరం ఈ దంపతులు ఇద్దరూ కూడా మగబిడ్డకు జన్మనిచ్చి తల్లితండ్రులు కాగా, తాజాగా మరోసారి వీరిద్దరూ తల్లితడఁరులు అయ్యారు. యువరాజ్ సింగ్ భార్య కీచ్ ఈ ఉదయం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ యువరాజ్ తన సోషల్ మీడియా వేదికగా తెలియహ్చేస్తూ సంతోషాన్ని వెలిబుచ్చాడు. కాగా యువరాజ్ మాట్లాడుతూ మా చిన్నారి బిడ్డ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపామని ఆనందాన్ని తెలిపాడు.
ఇక ఈ వార్త పట్ల ఇండియా క్రికెటర్లు మరియు అభిమానులు కూడా కంగ్రాట్స్ చెబుతూ యువరాజ్ ను ప్రశంసలతో ముంచెత్తారు.