తన అసిస్టెంట్ కి భారీ సాయం చేసిన జబర్దస్త్ నటుడు…!

-

ఈ కరోనా కష్ట కాలంలో సినీ నటులు పేదలకు అండగా నిలుస్తున్నారు. తాజాగా మరో జబర్దస్త్ నటుడు తన వద్ద పని చేసే వ్యక్తికి అండగా నిలిచారు. నల్లగొండ జిల్లాలోని గుర్రం పోడ్ మండలం పాల్వాయి గ్రామానికి చెందిన పేద రైతుకు జత ఎడ్లను బహుమతిగా అందించాడు జబర్దస్త్ ఫేం శకలక శంకర్. కొన్నాళ్లుగా తనవద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్న బైరు నర్సింహా పేదరికాన్ని గమనించిన శంకర్ సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు.Shakalaka Shankar shoots his mouth off!

ఆ కుటుంబానికి ఆసరాగా ఆర్థిక సహాయంతో పాటు వ్యవసాయ పనుల నిమిత్తం జత ఎడ్లను స్వయంగా అందించిన నటుడు శంకర్… భవిష్యత్తులో ఏ కష్టాలు వచ్చినా సరే నేను మీకు ఉన్నాను అని నమ్మకం కలిగించాడు. కొంత వ్యవసాయ పెట్టుబడి కూడా ఇచ్చాడు. శంకర్ సాయంపై రైతు కుటుంబం సంతోషంలో మునిగితేలుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news