కూతురి ప్రేమాయణం : తగలెట్టేసిన తల్లి.. ఇద్దరూ మృతి !

-

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం మొగిలిగిద్దలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన కూతురు చదవకుండా ప్రేమాయణం నడుపుతోందన్న విషయం తెలుసుకున్న తల్లి కోపంతో కిరోసిన్ పోసి చంపేందుకు ప్రయత్నించింది. ఇంతలో ఆమె మీద కూడా కాస్త కిరోసిన్ ఒలకడంతో మంటలు వ్యాపించి కూతురుతో పాటూ తల్లి కూడా మంటల్లో చిక్కుకుంది. ఈ ఇద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందారు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన పాండు, చంద్రకళల కుమార్తె శ్రవంతికి 17 ఏళ్ళు. ఆమెను చదువుకోమని పంపిస్తే అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడింది.

fire
fire

ఈ విషయం తెలియడంతో తల్లిదండ్రులు కుమార్తెను చాలా రోజులుగా మందలిస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారం మీద ఈ నెల 15న తల్లి చంద్రకళ, కుమార్తెల మధ్య గొడవ జరిగింది. అదే సమయానికి ఇంటికి వచ్చిన తండ్రి చంపేస్తే దరిద్రం వదులుతుందని కూతురిపై కిరోసిన్‌ పోశాడు. ఈక్రమంలో ఆమె పక్కనే ఉన్న చంద్రకళ పైనా పడింది. అయితే అది పట్టించుకోకుండా చంద్రకళ అగ్గిపుల్లను గీరి తన కుమార్తెపై వేసింది. తన మీద కూడ కిరోసిన్ ఉండడంతో ఆమెకు కూడా మంటలంటుకున్నాయి. దీంతో ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. ఉస్మానియా ఆసుపత్రిలో 4 రోజులుగా చికిత్స పొందుతున్న వీరిద్దరూ నిన్న మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news