ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ 16 లో టీం ఇండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. కాగా ఈ సీజన్ లోనూ కీలక ఫామ్ లో ఉన్న సూర్య ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. మొదటి మ్యాచ్ లలో పూర్తిగా తేలిపోయిన సూర్య కుమార్ యాదవ్ రెండవ అంచె ఐపీఎల్ లో మాత్రం మాములుగా ఆడడం లేదు. కాగా గత అయిదు మ్యాచ్ లలో సూర్య కుమార్ మూడు అర్ద సెంచరీలు చేశాడంటే ఎటువంటి ఫామ్ లో ఉన్నాడో క్లియర్ గా అర్ధమవుతోంది. కాగా తాజాగా ఇతని ఫామ్ గురించి మాజీ ఇండియన్ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ ప్రస్తుతం సూర్య ఉన్న ఫామ్ లో అతన్ని ఆపాలంటే ఎవరి తరం కాదు అన్నాడు.
పైగా అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పడిన బంతిని కొట్టకుండా ఉండాలంటే అతని బ్యాట్ ను పట్టుకోవాలి, లేదా స్కోర్ చేయకుండా అతని కాళ్ళను పట్టుకోవాలి అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు.