జింబాబ్వే వేదికగా అయిదు జట్లు గత 10 రోజులుగా టీ 10 లీగ్ లో తలపడిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు కాసేపటి క్రితమే ఫైనల్ మ్యాచ్ ముగిసింది. డర్బన్ మరియు జోబర్గ్ జట్ల మధ్యన ఫైనల్ జరుగగా.. మొదటి బ్యాటింగ్ చేసిన జోబర్గ్ జట్టు నిర్ణీత ఓవర్ లలో 4 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. బలమైన బౌలింగ్ లైన్ అప్ ఉన్న జట్టుకు ఈ స్కోర్ ను కట్టడి చేయడం ఏమంత కష్టం కాదు. కానీ సాదించలేనంత కష్టమైన స్కోర్ కూడా కాదు. లక్ష్య చేదనలో డర్బన్ జట్టు మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకొని జిమ్ ఆఫ్రో టీ 10 లీగ్ మొదటి టైటిల్ ను అందుకున్న జట్టుగా రికార్డ్ సృష్టించింది. ఈ చేధనలో సీఫర్ట్, ఫ్లెచర్, జజై మరియు ఆసిఫ్ అలీ లు బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు విజయాన్ని సాధించి పెట్టారు..
కాగా జోబర్గ్ జట్టు ఫీల్డింగ్ లో చాలా పేలవంగా ఉండడం కూడా ఓటమికి కారణం అని చెప్పాలి. ఫ్లెచర్ మరియు ఆసిఫ్ అలీ క్యాచ్ లను వదిలేసి భారీ మూల్యం చెల్లించుకున్నారు.