వర్ష బీభత్సం.. రోడ్డెక్కిన వరద బాధితులు

-

భద్రాచలం వద్ద గోదావరి నది పోటెత్తుతోంది. శుక్రవారం రాత్రి 53.1 అడుగులుగా ఉన్న నీటిమట్టం శనివారం ఉదయానికి మరో అడుగు పెరిగి 54.30 అడుగులుగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

Effect of flood: రోడ్డెక్కిన వరద బాధితులు

కొన్ని చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో వరద బాధితుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పునరావాస కేంద్రాల్లో సరైన వసతుల్లేక చాలా అవస్థలు పడుతున్నారు బాధితులు. భద్రాచలంలో ముంపు ప్రాంత ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల నిర్వహణ సరిగా లేదంటూ వరద బాధితులు రోడ్డెక్కారు. వరద బాధిత పునరావస కేంద్రాల్లో ఉంటున్న తమకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు తక్షణమే భోజనాలు ఏర్పాటు చేయాలని భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య అధికారులను డిమాండ్ చేశారు. భోజనాలు కూడా సమయానికి పెట్టకుండా తమను అర్ధాకలితో ఉంచుతున్నారని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news