ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కొద్ది సేపటి క్రితమే తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత విభాగానికి తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేసినట్లు వెల్లడించారు. రాజీనామా వెనుక ఎలాంటి ఒత్తిళ్లూ, రాజకీయాలు లేవన్నారు. తనకు సహకరించిన సిబ్బంది, ఆర్బీఐ డైరెక్టర్లకు కృతజ్ఞతలు చెప్పారు.
రిజర్వు బ్యాంకు గవర్నర్గా సేవలందించడం గర్వంగా ఉందన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆర్బీఐ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఉర్జిత్ రాజీనామా చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.