కేసీఆర్ నాయకత్వం ఈ రాష్ట్రానికి ఓ దిక్సూచి

-


తెరాస అధినేత కేసీఆర్ నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి ఓ దిక్సూచిలాంటిదని కేటీఆర్ అన్నారు. గురువారం జనగాం జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. తెరాస కార్యకర్తలను ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడుతూ…తెరాస పుట్టుకే ఓ చరిత్రన్నారు, తెలంగాణ ఉద్యమం నుంచి పక్కకు జరిగితే రాళ్లతో కొట్టమని చెప్పిన మహా నేత కేసీఆర్ అంటూ ఉద్యమ స్వరూపాన్ని కార్యకర్తలకు వివరించారు. తెలంగాణ ప్రజలు తెరాసకు రెండో సారి అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించడం మరింత బాధ్యత పెంచిందన్నారు. గెలుపులో పాఠాలు.. ఓటమిలో గుణపాఠం ఉంటాయని వీటిని అన్ని వేళల గమనిస్తూ పార్టీని బలోపేతం చేసుకోవాలని సూచించారు.

స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ జెండా ఎగరాలన్నారు. ప్రజా ప్రతినిధుల నుంచి పార్టీ కార్యకర్త వరకు మరో ఎనిమిది నెలల పాటూ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. సైనికుల్లా ముందుకు సాగుదామంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మిస్తామన్నారు. మంత్రులు కూడా జిల్లా పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారన్నారు. కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా పార్టీ కార్యాలయానికి వెళ్తే పరిష్కారం దొరుకుతుందనే భరోసా ఇచ్చే దిశగా కార్యచరణ రూపొందిస్తున్నామన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఉద్యమాలకు పురిటిగడ్డ.. ఉద్యమాలకు గుండెవంటి వరంగల్‌ నుంచే తన పర్యటన ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. సమిష్టి కృషితో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news