సాక్షి మార్చి 24, 2008న 23 ఎడిషనులతో ప్రారంభించబడిన సంగతి మనకు తెలిసిందే. అమెరికాకు చెందిన మారియో గార్సియా సాక్షి దినపత్రిక రూపకల్పన చేశాడు. జగతి పబ్లికేషన్స్ లో భాగంగా ఈ పత్రిక పనిచేస్తుంది. తెలుగు దినపత్రికారంగంలో మొదటిసారిగా అన్ని పేజీలను రంగులలో ముద్రణ చేసిన పత్రిక సాక్షి. అయితే తాజాగా వైఎస్ షర్మిల ఈ దినపత్రికపై పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
సాక్షి పత్రికలో తనకూ భాగముందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ‘జగన్ కి, నాకు సమాన భాగం ఉండాలని YSR నిర్ణయించారు. ఇప్పుడు అదే సాక్షి పత్రికను వాడుకుని నాపై దూషణలు చేస్తున్నారు. ఇంత నీచానికి దిగజారాల్సిన అవసరం ఏముంది? పోలవరం, ప్రత్యేక హోదా, అభివృద్ధి ఇలా వివిధ అంశాలపై మాట్లాడుతున్నా. ఒక్క సమస్యపైనా సమాధానం ఇవ్వకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు’ అంటూ ఫైర్ అయ్యారు.