ఒక్క మెయిల్ తో 7 లక్షలు పోగొట్టుకున్నారు…!

-

హైదరాబాద్ లో ఒక నకిలీ మెయిల్ కొంప ముంచింది. భారీగా డబ్బులు పోగొట్టుకుంది ఒక సంస్థ. ఒక నకిలీ మెయిల్ ని నమ్మి దాదాపుగా 7 లక్షల వరకు పోగొట్టుకున్నారు. హైదరాబాద్‌లో పిత్తి ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ కంపెనీ ఉంది. ఈ కంపేని నగదు వ్యవహారాలు చూస్తున్న ఒక వ్యక్తికి సీఎండీ పేరిట ఓ ఈ మేయిల్‌ వచ్చింది. తాను మీటింగ్ లో బిజీ గా ఉన్న అని… వెంటనే వెంటనే రూ.6.8 లక్షల ట్రాన్స్‌ఫర్‌ చేయాలని మెసేజ్ పంపారు.

వెంటనే ఆ వ్యక్తి డబ్బు పంపి… సీఎండీకి డబ్బు పంపించినట్టు మేసేజ్‌ చేశాడు. తాను అసలు ఈ మెయిల్ పెట్టలేదని… తాను అవసరమైతే ఫోన్ చేస్తా కదా అని అడగడంతో ఒక్కసారిగా అకౌంట్స్ చూస్తున్న వ్యక్తి షాక్ అయ్యాడు. వాకబు చేసారు.. అది నకిలీ మెయిల్ అని తెలియడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news