వామ్మో.. ఏందీది.. రెండుత‌ల‌ల‌తో రెండు ఎలుక‌ల‌ను మింగేస్తున్న పాము..!

-

సాధార‌ణంగా పెద్ద పామును చూస్తేనే ఎవ‌రికైనా వ‌ణుకు పుట్టాల్సిందే. ఇక ఏ కోడెనాగు లాంటిదో అయితే ఇంకేమైనా ఉందా ప‌రుగు లంకించుకోవాల్సిందే. మ‌రి ఒక్క త‌ల ఉన్న పాముల‌ను చూస్తేనే మ‌న‌కు ఇంత‌లా భ‌య‌మేస్తే ఇక రెండు త‌ల‌ల పామును చూస్తే.. అవును కానీ రెండు త‌ల‌ల పాములు అస‌లు స‌రిగ్గా క‌నిపించ‌వు. కానీ రెండు త‌ల‌ల పాము గురించే ఇప్పుడు మ‌నం తెలుసుకోబోయేది. ఒకేసారి ఆ రెండు తల‌ల పాము చేసిన ప‌ని ఇప్పుడు తెలుసుకుందాం.

Man Finds Over 30 Rattlesnakes In Shed in texas

సాధార‌ణంగా ఒక్క త‌ల పాము ఒకేసారి ఒక్క ఎలుక‌ను తింటేనే ఆశ్చ‌ర్య‌పోతాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే పాము ఏకంగా రెండు త‌ల‌ల‌లో ఒకేసారి రెండు ఎలుక‌ల‌ను మింగేసింది. ఈ రెండు తలల పాము కూడా చూసేందుకు చాలా భ‌యంక‌రంగా ఉండ‌టంతో నెట్టింట సంచ‌ల‌నం రేపుతోంది. ఇక దీన్ని చూసిన నెటిజ‌న్లు ఊరుకుంటారా విప‌రీతంగా వైర‌ల్ చేయ‌డంతో ల‌క్ష‌ల్లో వ్యూస్ వ‌స్తున్నాయి.

అయితే అమెరికాకు చెందిన కంటెంట్ క్రియేటర్ బ్రియాన్ బార్జిక్ అనే వ్య‌క్తి సోష‌ల్ మీడియాలో ఈ వీడియోను వ‌దిలాడు. ఇందులో ఉండే రెండు తలల పాము త‌న‌కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన రెండు ఎలుకలను త‌న రెండు త‌ల‌ల‌తో ఒకేసారి తింటున్న సీన్లు చూస్తేనే వ‌ణుకు పుట్టేలా ఉన్నాయి. అయితే ఈ రెండు తలల పాము పేరు జెన్, జెర్రీ అని ఆయ‌న త‌న పోస్టు ద్వారా తెలిపాడు. వింత ఏంటంటే ఆ రెండు త‌ల‌లు ప‌క్క ప‌క్క‌నే ఉన్నా కూడా ఒకేసారి రెండు త‌ల‌ల‌తో ఆహారం తీసుకుంటుంది. మీరూ చూడండి ఆ వీడియోను.

Read more RELATED
Recommended to you

Latest news