మేషరాశి : కుటుంబ సంతోషం, దేవాలయ దర్శన భాగ్యం, విందులు, వినోదాలు. మంచి ఫలితాల కోసం ఈశ్వర ఆరాధన లేదా అభిషేకం చేయండి.
వృషభరాశి: -లాభాలు, విజయం, అధిక ఖర్చులు, చిన్నచిన్న సమస్యలు. పరిహారం ఇష్టదేవతారాధన చేసుకోండి.
మిధునరాశి : బంధుమిత్రుల రాక, దేవాలయ సందర్శన, రాజకీయనాయకులతో సమాగం. పరిహారాలు అంగారక గ్రహం, గురుగ్రహానికి పూజచేయండి మంచి ఫలితం వస్తుంది.
కర్కాటకరాశి : ప్రతికూలవాతావరణం, బ్యాంకులావాదేవీల్లో నష్టం, ఇబ్బందులు. పరిహారం గోసేవ లేదా నారాయణ సేవ చేసుకోండి.
సింహరాశి : ప్రతికూలత, చిన్నచిన్న సమస్యలు, ప్రయాణాలతో అలసట. పరిహారాలు రావిచెట్టుకు ప్రదక్షణలు లేదా సుబ్రమణ్య ఆరాధన.
కన్యారాశి : ధనలాభం, అనుకోని మార్పులతో, విందులు వినోదాలు. మంచి ఫలితాల కోసం ఇష్టదేవాతరాధన చేయండి.
తులరాశి : స్నేహితులతో విందులు, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి, వస్తులాభం. పరిహారాలు గణపతి లేదా కార్తికేయారాధన చేయండి.
వృశ్చికరాశి: విజయం, బాకీలు వసూలు, కీర్తిలాభం, జయం. ఆప్తులకు సహాయం చేయండి లేదా అన్నదానానికి సహాయం చేయండి.
ధనస్సురాశి : వస్తునష్టం, చిన్నచిన్న సమస్యలు, అలసట. మంచి ఫలితాల కోసం గోసేవ/నారాయణ సేవ చేయండి.
మకరరాశి : దేవాలయ దర్శన, బంధువర్గంతో లాభం, ధనలాభం. ప్రయాణ సౌఖ్యం. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.
కుంభరాశి : సోదర సహకారం, ఆనందం, ధనలాభం, వ్యాపార లాభం. ఇష్టదేవతారాధన చేయండి.
మీనరాశి : ప్రారంభించిన పనులు పూర్తవుతుంది. విజయం, సమస్యలను పరిష్కారం. మరింత మంచి ఫలితాల కోసం సూర్యనమస్కారాలు, తులసీచెట్టు పూజ చేయండి.
నోట్‌ః సూర్యునికి జలం సమర్పించండం అంటే సూర్యోదయ సమయంలో స్నానమాచరించి రాగి చెంబునిండా (ఫ్రెష్) జలం తీసుకుని సూర్యనామాలు చదువుతూ ఒక ప్లేట్‌లో నీళ్లు ధారగా పోయాలి. ఆ తర్వాత ఆ నీటిని తులసి లేదా ఏదైనా చెట్టుకు మొదట్లో పోయండి.
-కేశవ