తెరాస పార్టీ తరుపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలన్న తెరాస అభ్యర్థనపై శాసనమండలిలో శనివారం వాడీ వేడిగా వాదనలు జరిగాయి.అయితే ఈ రెండు పక్షాల వాదనలు విన్న మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ తన నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. తెరాస నుంచి రాములు నాయక్, భూపతిరెడ్డి, యాదవరెడ్డి లు మండలి సభ్యులుగా గెలిచి కాంగ్రెస్ తో చేరడాన్ని తీవ్రంగా పరిగణించిన తెరాస వారిపై అనర్హత వేటు వేయాలని తెరాస శాసన మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఈ ముగ్గురు ఎమ్మెల్సీల తరపున పలువురు న్యాయవాదులు తమదైన శైలిలో వాదనలు వినిపించారు. కొద్ది వారాలుగా ఈ విషయమై వాదనలు జరుగుతున్న నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న చైర్మన్ తన తీర్పుని రిజర్వ్ చేశారు.