రాహు కాలంలో దీపారాధన చేస్తే ఈరాశులకు అత్యంత శుభకరం! ఏప్రిల్ 16 రాశి ఫలాలు

ఏప్రిల్ 16 మంగళవారం-రోజువారి రాశిఫలాలు

మేషరాశి – ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది. ఓపికతో ఉండాలి. కుటంబంలో అపార్థాలు చేసుకునే సమయం. రోమాన్స్‌కు ఇది మంచి సమయం. అధికశ్రమ అయినా ఫలితం తక్కువ. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
పరిహారాలు – నవగ్రహాలకు ప్రదక్షిణలు, ఎర్రవత్తులతో దీపారాధన చేయండి.

వృషభరాశి – ఆరోగ్యానికి ప్రాధన్యం ఇవ్వండి. కుంటుంబం నుంచి సహకారం లభిస్తుంది. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. వృత్తిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.
పరిహారాలు – శివాభిషేకం, సూర్యనమస్కారాల వల్ల ఆరోగ్యం, ఆందోళన తగ్గుతాయి.

16 april 2019 tuesday horoscope

మిథునరాశి – ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి. కుటుంబంలో సఖ్యత, ఓపికతో ఎదుటివారు చెప్పేది వినండి. అనవసర అపార్థాలకు అవకాశమివ్వకండి. పనిచేసేచోట ఇబ్బందికరమైన పరిస్థితి ఉండవచ్చు. ప్రయాణాల వల్ల లాభం, స్టాక్‌మార్కెట్‌లకు దూరంగా ఉండండి.
పరిహారాలు – కుజగ్రహారాధన వల్ల అరోగ్యం, ఆర్థిక పరిస్థితులు, పనిచేసేచోట వ్యతిరేక పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి.

కర్కాటకరాశి – మంచి ఆరోగ్యం, శుభకార్య సూచన, భార్యతో అనుకూలత, పదోన్నతులకు ప్రయత్నయోచన, ప్రయాణాలు అనుకూలం.
పరిహారాలు – ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.

సింహరాశి – మంచి ఆరోగ్యం, కుటుంబంలో సహకారం, వివాదాలకు ఆస్కారం, ప్రయాణల వల్ల లాభం, చేసే పనిలో ఒత్తిడి ఉంటుంది.
పరిహారాలు – ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రదక్షిణలు, సింధూర ధారణ వల్ల ఒత్తిడి, వివాదాల నుంచి బయటపడుతారు.

కన్యారాశి – ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, కుటుంబ స్థితి గురించి పట్టించుకోవాల్సిన సమయం, ఆఫీసులో ఆశించిన ఫలితం ఉండదు, ఓపిక అవసరం, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం.
పరిహారాలు – రాహుకాలంలో దుర్గాదేవి ఆలయంలో దీపారాధన చేయండి. లేదా ఇంట్లో దేవుని గదిలో దీపారాధన చేసుకోండి.

తులారాశి – మంచి ఆరోగ్యం ఉంటుంది, కుటుంబం నుంచి మంచి వార్తలు వింటారు, పనిచేసే చోట అనుకూల మార్పులు, సన్నిహతులతో జాగ్రత్తగా మాట్లాడండి. ఆర్థికంగా ఇబ్బందులు.
పరిహారాలు – ఆంజనేయస్వామికి ప్రదక్షిణలు, దుర్గాదేవికి దీపారాధన మేలు చేస్తుంది.

వృశ్చికరాశి – మంచి ఆరోగ్యం, సంతోషం, కుటుంబంలో ఆనందం, పనిచేసే చోట అందిరి సహకారం అందుతుంది, ప్రయాణాలు కలిసి వస్తాయి. పొరుగువారికి ఆర్థికంగా ఆదుకుంటారు.
పరిహారాలు – ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షిణలు మేలు చేస్తాయి.

ధనస్సురాశి – ఆరోగ్యం, శుభకార్య సూచన, స్నేహితులు, ఆప్తులతో సఖ్యత, వృత్తిలో అనుకూలత, పనులు పూర్తి, ప్రయాణాలు కలిసివస్తాయి.
పరిహారాలు – దగ్గర్లోని దేవాలయంలో ప్రదక్షిణలు, దీపారాధన మేలు చేస్తుంది.

READ ALSO  ఏప్రిల్ 17, 2019 బుధవారం రాశి ఫలాలు

మకరరాశి – ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి, కుటుంబంలో వివాదాలు, ఓపిక అవసరం, అనవసర ప్రయాణాలు వాయిదా వేయండి, పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
పరిహారాలు – కుజగ్రహానికి ఎర్రపూలతో అర్చన, ఎర్రవత్తులతో దీపారాధన చేయండి మేలు చేస్తుంది.

కుంభరాశి – మంచి ఆరోగ్యం, శుభకార్య సూచన, ప్రేమలో అనుకూలత, పదోన్నతులకు ప్రయత్నం చేయడం మంచిది, ప్రయాణాలు కలిసివస్తాయి. ఆర్థికంగా బాగుటుంది.
పరిహారాలు – ఇష్టదేవతరాధన, గోసేవ చేసుకోండి.

మీనరాశి – మంచి ఆరోగ్యం, కుటుంబంలో సంతోషం, ప్రేమ విషయంలో అనుకూలత, చేసేపనిలో అనుకూలత, ఆర్థికంగా బాగుటుంది, ప్రయాణాలు కలిసి వస్తాయి.
పరిహారాలు – అమ్మవారికి అర్చన, ఎర్రవత్తులతో దీపారాధన చేయండి.

-కేశవ

Loading...