మీరందరు గర్వపడే సినిమా జెర్సీ..!

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా జెర్సీ. నాని క్రికెటర్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. సోమవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ అటెండ్ అయ్యారు. ఇక ఈవెంట్ లో భాగంగా మైక్ అందుకుని మాట్లాడిన నాని చాలా కాన్ఫిడెంట్ గా సినిమా పక్కా హిట్ అని చెప్పాడు.

మా కుటుంబం.. మన కుటుంబం.. అందరు గర్వపడే సినిమా ఇది అవుతుందని.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చినందుకు వెంకటేష్ గారికి థ్యాంక్స్ అంటూ తన సినిమా బాబు బంగారం కు నేను వెళ్లాను.. ఆయన జెర్సీకి గెస్ట్ గా వచ్చారు. ఇద్దరం కలిసి మల్టీస్టారర్ చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా అన్నారు నాని. ఇక జెర్సీ సినిమా తన కెరియర్ లో బెస్ట్ సినిమా అవుతుందని. ఇప్పటికి గౌతం తిన్ననూరి సినిమా గురించి పనిచేస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయాడని.. ఇప్పుడు స్టేజ్ మీద అతను మాట్లాడలేకున్నా ఏప్రిల్ 19న అతని సినిమా మాట్లాడుతుందని అన్నాడు నాని.