దాన్ని మాత్రం వదల: నాగబాబు

84

తన తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టడం, ఆయన కూడా పార్టీలో చేరడం, నరసాపురం ఎంపీ స్థానం నుంచి జనసేన తరుపున పోటీ చేశారు. ఎన్నికల సమయం కావడంతో ఆయనకు ఎంతో ఇష్టమైన జబర్దస్త్ షోను కూడా వదిలేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నాగబాబు.

కొణిదెల నాగబాబు అనే కన్నా.. జబర్దస్త్ నాగబాబు అంటేనే కరెక్ట్‌గా సూట్ అవుతుంది కాబోలు. ఆయన జీవితాన్ని రెండు భాగాలుగా విభజిస్తే ఒకటి జబర్దస్త్ ముందు నాగబాబు.. జబర్దస్త్ తర్వాత నాగబాబు. అవును.. పేరుకు అన్న సినిమాల్లో మెగాస్టార్ అయినప్పటికీ.. నాగబాబు మాత్రం సినిమాల్లో ఇమడలేకపోయారు. నిర్మాతగానూ నాగబాబు బిగ్ ఫెయిల్యూర్. తర్వాత ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని.. దొరక్క దొరక్క వచ్చిన అవకాశం జబర్దస్త్. ఆ షో సక్సెస్ అవడం… నాగబాబుకు నాలుగు రాళ్లు సంపాదించుకునే అవకాశం రావడంతో ఇప్పుడు కొంచెం ఆర్థికంగా, మానసికంగా నిలదొక్కుకున్నారు.

ఆ తర్వాత తన తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టడం, ఆయన కూడా పార్టీలో చేరడం, నరసాపురం ఎంపీ స్థానం నుంచి జనసేన తరుపున పోటీ చేశారు. ఎన్నికల సమయం కావడంతో ఆయనకు ఎంతో ఇష్టమైన జబర్దస్త్ షోను కూడా వదిలేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నాగబాబు. ఇప్పుడు ఫ్రీ అయిపోయారు. ఎన్నికలు కూడా ముగిశాయి. ఒకవేళ ఎంపీగా నాగబాబు గెలిస్తే… జబర్దస్త్ షోకు జడ్జ్‌గా వెళ్తారా? లేక జబర్దస్త్ షోను వదిలేస్తారా? అనే విషయంపై మాత్రం అంతగా క్లారిటీ లేకుండే.

అయితే.. ఆయన తాజాగా ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడినప్పుడు.. జబర్దస్త్ షోలో మానేయకండి సార్.. అంటూ కామెంట్లు చేశారట. దీంతో జబర్దస్త్ షో గురించి మాట్లాడిన నాగబాబు.. ఏది ఏమైనా.. నేను జబర్దస్త్ షోను మానను. ఎంపీగా గెలిచినా సరే.. జబర్దస్త్ షోలో పాల్గొంటా. దాన్ని మాత్రం వదల. అది కూడా ఒకరకంగా చెప్పాలంటే సమాజ సేవ లాంటిదే. కాకపోతే దానికి పారితోషకం తీసుకుంటాము. నెలలో ఐదు రోజులు మాత్రమే ప్రోగ్రామ్ ఉంటుంది. మిగితా సమయంలో రాజకీయాలు చూసుకుంటాను. కాకపోతే ఇక సినిమాలు మాత్రం చేయను.. అంటూ తన మనసులో మాటను వెల్లడించారు నాగబాబు.