అన్ని రాశుల వారు మౌనాన్ని పాటిస్తే విశేషం!
మేషరాశి: ప్రతికూలమైన రోజు. చికాకులు,పనుల్లో జాప్యం. పరిహారాలు మౌనం పాటించండి. వీలైతే ఏదో ఒకటి దానధర్మం చేయండి.
వృషభరాశి: మిశ్రమ ఫలితాలు, కళత్ర వర్గంతో వివాదాలు, మిత్రులతో సంతోషం, బంధువుల రాక. పరిహారాలు మౌనం పాటించండి. ఏదో ఒకటి దానం చేయండి.
మిధునరాశి: వివాదాలు, ధనవ్యయం,రక్త సంబంధీకులతో విరోధాలు. పరిహారాలు వివాదాలకు దూరంగా ఉండండి. మౌనం పాటించండి. ఏదో ఒకటి దానం చేయండి.
కర్కాటకరాశి: వ్యాపార లాభం, సుఖం, మార్పులు. పరిహారాలు రాహుకాలంలో మౌనంగా ఉండటం. అన్నదానానికి కొంత ధనాన్ని ఖర్చు చేయండి.
సింహరాశి: మంచి ఫలితాలు, వ్యాపారలాభం, అన్నింటా విజయం, స్వల్ప విబేధాలు. పరిహారాలు మౌనంగా ఉండటం. గోసేవ లేదా ఏదో ఒకటి దానం చేయండి విశేష ఫలితం ఉంటుంది.
కన్యారాశి: మిశ్రమ ఫలితాలు, కొత్త విషయాలు తెలుస్తాయి, మనోదుఃఖం. పరిహారాలు మౌనీ అమావాస్యను పాటించండి. దీనికోసం మన సైట్‌లో ఐటం చదవండి.
తులారాశి: మిశ్రమ ఫలితం, బంధువుల రాక, అశుభ సూచకం. పరిహారాలు మౌనంగా ఉండటం, ఏదో ఒకటి దానం చేయడం. వివాదాలకు దూరంగా ఉండటం.
వృశ్చికరాశి: మంచిరోజు, అనుకూలమైన ఫలితాలు, వృత్తిలో అనుకూలం, యోగం, అధిక శ్రమ. పరిహారాలు రాహుకాలంలో మౌనంగా ఉండండి. ఏదో ఒకటి దానం చేయండి.
ధనస్సురాశి: మిశ్రమ ఫలితాలు, పనుల్లో ఆటంకాలు, స్వల్ప విబేధాలు, వ్యాపారంలో లాభాలు. పరిహారాలు ధశరథ శనిస్తోత్రం చదువుకోండి. లేదా చాలీసా పఠించండి.
మకరరాశి: మిశ్రమం. స్త్రీతో కార్యజయం, కళత్ర సుఖం, వస్తునష్టం, కార్యాలలో ఆలస్యం. పరిహారాలు గోసేవ/దానధర్మాలు.
కుంభరాశి: ప్రతికూల ఫలితాలు, కార్యాలలో జాప్యం, వ్యవహార నష్టం, సోమరితనం. పరిహారాలు మౌని అమావాస్య కాబట్టి మౌనం పాటించండి. ఏదో ఒకటి దానం చేయండి.
మీనరాశి: మిశ్రమం. ఆకస్మిక ధనలాభం, వాహనాల మార్పులు, పక్కవారితో విబేధాలు. పరిహారాలు మౌనంగా ఉండండి. గోసేవ లేదా ఈశ్వర పూజ చేసుకోండి.
-కేశవ