వేంకటేశ్వరస్వామికి పిండిదీపం పెడితే ఈ రాశివారికి విశేష ఫలితం! ఫిబ్రవరి 8 రాశిఫలాలు

ఫిబ్రవరి 8 శుక్రవారం – రోజువారి రాశిఫలాలు

మేషరాశి : ప్రతికూల ఫలితాలు, తల్లి తరుపు బంధువులకు ఇబ్బందులు, ఇంట్లో సమస్యలు. పనుల్లో జాప్యం.
పరిహారాలు: చండీదీపారాధన, అమ్మవారి కుంకుమా ధారణ మంచిచేస్తుంది.

వృషభరాశి : మిశ్రమం. ఆకస్మిక ధనలాభం, నష్టం, దైవదర్శన సూచన, పనుల్లో నెమ్మదితనం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి ఆరాధన మంచి చేస్తుంది. ఆరావళి కుంకుమ పెట్టుకోండి.

మిథునరాశి : మిశ్రమ ఫలితాలు, ఇంట్లో శుభకార్యసూచన, బాకీలతో ఇబ్బందులు, పనుల్లో నెమ్మది.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి బియ్యపిండి/గోధుమ పిండితో దీపం చేసి నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి.

కర్కాటకరాశి : అనుకూల ఫలితాలు. కార్యజయం, చేసే పనిలో అనుకూలం. వ్యవహారాలు కలిసివస్తాయి.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, గోసేవ చేసుకోండి మంచి జరుగుతుంది.

సింహరాశి : అనుకూల ఫలితాలు, కార్యజయం, ధనలాభం, వాహన యోగం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి మారేడుదళాలతో అర్చన/ ఆరావళి కుంకుమ ధారణ మంచి ఫలితాలు లభిస్తాయి.

కన్యారాశి : అనుకూల ఫలితాలు, కార్యజయం,లాభం, ధనప్రాప్తి, చేసే పనుల్లో లాభం.
పరిహారాలు: దేవీ పూజ/స్తోత్రపారాయణం లేదా ఆరావళి కుంకుమ ధారణ మంచి చేస్తుంది.

తులారాశి : అనుకూల ఫలితాలు, కార్యజయం, వస్తులాభం, పనులు పూర్తి.
పరిహారాలు: అమ్మవారి స్తోత్రాలను వినండి లేదా పారాయణం చేయండి. గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది.

వృశ్చికరాశి : మిశ్రమం. వస్తులాభం, మనస్తాపం, దేవాలయ దర్శన సూచన.
పరిహారాలు: చండీదీపారాధన/గోసేవ మంచి చేస్తుంది.

ధనస్సురాశి : మిశ్రమం. వాహన యోగం, చెడువార్తా శ్రవణం. కార్యనష్టం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి పిండి దీపారాధన/మారేడుదళాలతో పూజచేయండి మంచి జరుగుతుంది.

మకరరాశి : మిశ్రమ ఫలితాలు, ధనవ్యయం, కొత్త వస్తువులు కొంటారు, ఆకస్మిక ప్రమాదాలు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి పిండితో దీపారాధన, ఆరావళి కుంకుమ ధారణ చేయండి మంచి జరుగుతుంది.

కుంభరాశి : ప్రతికూల ఫలితాలు, బంధువుల రాక, స్త్రీమూలక విరోధాలు, వ్యవహార నష్టం.
పరిహారాలు: అమ్మవారికి చండీదీపారాధన, వేంకటేశ్వరస్వామి ఆరాధన మంచి చేస్తుంది.

మీనరాశి : మిశ్రమ ఫలితాలు, వస్తులాభం,ఇంట్లో సమస్యలు, కలహం.
పరిహారాలు: అమ్మవారికి పూజ,ఆరావళి కుంకుమ ధారణ మంచిచేస్తుంది.

– కేశవ