గణపతికి గరికతో పూజచేస్తే ఈరాశులకు అంతా విజయమే!ఏప్రిల్ 23 మంగళవారం- రోజువారి రాశిఫలాలు

మేషం:ఆరోగ్యం సతాయిస్తుంది, కుటుంబంలో అపార్థాలకు అవకాశం, ప్రేమికులకు ఒపిక అవసరం, వృత్తిలో అనుకున్నస్థాయిలో ఈ రోజు పనిచేయలేరు. ఆర్థికంగా ఇబ్బంది, స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు అనుకూలించవు, ప్రయాణాల వల్ల ఖర్చు. శ్రమ.
పరిహారాలు: ప్రాతఃకాలంలో గణపతి దేవాలయానికి వెళ్లి గరికతో అరాధన చేయండి. అదేవిధంగా 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత పనులు ప్రారంభించండి.

వృషభం: ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి, కుటంబ సభ్యులతో సహనాన్ని కోల్పోకండి, ప్రేమికులకు అనుకూలమైనరోజు, పనిచేసేచోట మీ బాస్ మీ పనిపట్ల తృప్తి చెందడు, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోండి, మనీ విసయంలో జాగ్రత్త, స్టాక్ మార్కెట్‌లు అనుకూలిస్తాయి.
పరిహారాలు: హనుమాన్ చాలీసా పారాయణం వల్ల ఆరోగ్యం, విరోధాలు తప్పి మేలు జరుగుతుంది.


మిథునం: అనారోగ్య సూచన, కుటుంబంలో ఇబ్బందులు, ప్రేమికులకు అనుకూలం, వృత్తిలో సాధారణంగా ఉంటుంది, ప్రయాణాలు అనుకూలిస్తాయి, స్టాక్‌మార్కెట్లు మామూలుగా ఉంటాయి.
పరిహారాలు: శివాభిషేకం చేసుకోండి అనారోగ్యం, అసహనం పోతాయి.

కర్కాటకం:మంచి ఆరోగ్యం, శుభకార్య సూచన, ప్రేమికులకు ఆశ్చర్యకర ఫలితాలు, పనిచేసేచోట మీ పదోన్నతుల వంటి ముఖ్యవిషయాలను చర్చించవచ్చు, ప్రయాణాలు అనుకూలిస్తాయి, ఆర్థికంగా బాగుంటుంది, స్టాక్‌మార్కెట్లు అనుకూలం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ ప్రదక్షిణలు చేయండి.

సింహరాశి:అనారోగ్య సూచన, కుటుంబంతో ఎక్కువ సమయం కేటాయించండి, ప్రేమికులకు ఓపిక అవసరం, పనిచేసే చోట ఎక్కువ ఒత్తిడి, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోండి, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త, స్టాక్‌మార్కెట్ల పెట్టుబడికి అనుకూలం.
పరిహారాలు: ఆంజనేయస్వామి ఆరాధన, దేవాలయ ప్రదక్షిణలు మేలు చేస్తాయి.

కన్యారాశి:శారీరక శక్తి తక్కువగా ఉంటుంది, కుటుంబం నుంచి మంచి సహకారం, ప్రేమికులు అనవసర వివాదాలకు పోకండి, పనిచేసే చోట ఒత్తిడి, ప్రయాణాలు అధికశ్రమను ఇస్తాయి, వ్యాలెట్ మీద కన్నేసి వుంచండి, స్టాక్‌మార్కెట్ అంతగా అనుకూలంగా ఉండదు.
పరిహారాలు: గణపతి ఆరాధన, గరికతో పూజ మంచి చేస్తుంది.

తులారాశి:ఆనారోగ్య సూచన, కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు, ప్రేమికులకు అంత అనుకూల సమయం కాదు, పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక విషయాలు జాగ్రత్త, స్టాక్‌మార్కెట్లకు దూరంగా ఉండండి.
పరిహారాలు: ఆంజనేయస్వామి ఆరాధన, సింధూరధారణ మేలు చేస్తుంది.

వృశ్చికరాశి:మంచి ఆరోగ్యం, కుటుంబం నుంచి శుభవార్తా శ్రవణం, ప్రేమికుల మధ్య ఓపిక అవసరం, పనిచేసేచోట ఒత్తిడి ఎక్కువ, ఆర్థికంగా జాగ్రత్త, ప్రయాణాలలో అనవసర జాప్యం, స్టాక్‌మార్కెట్లు ప్రతికూలం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దుర్గాదేవి గుడిలో దీపారాధన మంచి చేస్తుంది.

ధనస్సురాశి:మంచి ఆరోగ్యం, శుభకార్య సూచన, ప్రేమికులకు అనుకూలం, పనిచేసే చోట అనుకూలం, ప్రయాణాలు అనుకూలం, ఆర్థికంగా బాగుంటుంది, స్టాక్‌మార్కెట్లు అనుకూలం.
పరిహారాలు: గణపతి పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది.

మకరరాశి:మంచి ఆరోగ్యం, కుటుంబంలో సంతోషం, ప్రేమికులకు ఓపిక అవసరం, పనిలో ఒత్తిడి, అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోండి, ఆర్థిక ఇబ్బందులు, స్టాక్‌మార్కెట్లు అనుకూలం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి దీపారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కుంభరాశి:మంచి ఆరోగ్యం, కుటుంబ సహకారం, ప్రేమికుల మధ్య మరింత అనుబంధం, పనిచేసేచోట అనుకూల మార్పులు, ప్రయాణాలను వాయిదా వేసుకోండి, ఆర్థిక ఇబ్బందులు, స్టాక్‌మార్కెట్లు అనుకూలం.
పరిహారాలు: దుర్గాదేవి దేవాలయ ప్రదక్షిణలు, చండీదీపారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

మీనరాశి: సంపూర్ణ అరోగ్యం, శుభకార్య సూచన, ప్రేమికులకు అనుకూలం, పనిచేసే చోట అనుకూలం, ప్రయాణాలు అనుకూలం, ఆర్థికంగా మంచిగా ఉంటుంది.
పరిహారాలు: ఇష్టదేవతరాధాన, దేవాలయ ప్రదక్షిణలు చేయండి.

– కేశవ