మూగవానిగా మెగా హీరో..!

-

మెగా ఫ్యామిలీ నుండి కొత్త హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ అసిస్టెంట్ గా చేసిన బుచ్చిబాబు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జాలరిగా నటిస్తున్నాడట వైష్ణవ్ తేజ్. అంతేకాదు సినిమాలో హీరోకి మాటలు రావట. మాటలు రాని మూగవాని పాత్రలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్నాడు.

మొదటి సినిమానే ప్రయోగాత్మకంగా చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్. ఈమధ్యనే సాయి తేజ్ చిత్రలహరి సినిమాతో హిట్ అందుకున్నాడు. కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. అన్నలా రొటీన్ గా కాకుండా మొదటి సినిమానే ఓ ఎక్స్ పెరిమెంట్ చేస్తున్న విష్ణవ్ తేజ్ రంగస్థలంలో చిట్టి బాబు అలియాస్ రాం చరణ్ ను స్పూర్తిగా తీసుకున్నట్టు ఉన్నాడు. మరి వైష్ణవ్ తేజ్ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news