ఫిబ్రవరి 14 ఆదివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

Join Our Community
follow manalokam on social media

శ్రీరామ ఫిబ్రవరి – 14- మాఘమాసం- ఆదివారం.

 

మేష రాశి:ఈరోజు మంచిగా ఉంటుంది !

ఈ రోజు మంచిగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో లాభాలు కలుగుతాయి. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత మంచి మార్కులు పొందుతారు. ఈరోజు నూతన గృహప్రయత్నాలు ప్రారంభిస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్యాన్ని చేసే అవకాశం ఉంటుంది. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ చేసుకోండి.

todays horoscope

వృషభరాశి:వ్యాపారాలో అధిక లాభాలు !

ఈరోజు బద్దకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. మొండి బకాయిలు వసూలు చేసుకొని ధనలాభం పొందుతారు. వ్యాపారాలో అధిక లాభాలు పొందుతారు.మీ మాట తీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. సోదరులతో కలిసి మెలసి ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు. నిరుద్యోగులు  ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశం ఉంది.

పరిహారాలు: అష్టలక్ష్మి  స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి:ఆభరణాలు కొనుగోలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. అనుకున్న పనులను సరైన సమయంలో పూర్తి చేసి కార్య సిద్ది పొందుతారు.వ్యాపారంలో పెట్టుబడులు పెటి  లాభాలు పొందుతారు. సోదరులతో కలిసి మెలిసి ఉంటారు. నిరుద్యోగులు ఉత్తమ ఉద్యోగం పొందే అవకాశం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది.  విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉత్తమ విద్యార్థులుగా పొందుతారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

పరిహారాలు: పేదలకు సహాయం చేయండి.

 

కర్కాటక రాశి:ఆఫీసులలో జాగ్రత్త !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టడం మంచిది లేదంటే స్వల్ప నష్టాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులు ఆఫీసులలో జాగ్రత్త వహించడం వల్ల బాగుంటుంది. తొందరపడి ఎవరికీ డబ్బులు ఇవ్వడం మంచిది కాదు. ధన నష్టం కలుగుతుంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండడం వల్ల బాగుంటుంది. అయినవారు, ఆత్మీయులు మోసం చేసే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. విద్యార్థులు చదువు మీదనే ఏకాగ్రత చూపడం మంచిది.

పరిహారాలు: ఈరోజు షట్పది స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:ఆర్థిక లాభాలు పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఆర్థిక లాభాలు పొందుతారు. అప్పుల బాధ నుంచి బయట పడతారు. ఉద్యోగస్తులు పై అధికారుల మెప్పు పొందుతారు. వ్యాపారాల్లో క్రొత్త పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థిక లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. కుటుంబ సభ్యులతో, బంధువులతో సంతోషంగా ఉంటారు.

పరిహారాలు: బిల్వాష్టకం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:శుభవార్తలు వింటారు !

ఈరోజు బాగుంటుంది. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి కీర్తిని పొందుతారు. ఉద్యోగస్తులు అనుకున్న స్థాలాలకు ఉద్యోగాన్ని మార్పు చేసుకుంటారు. ప్రయాణాలకు అనుకూలం. శుభవార్తలు వింటారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో బాగుంటుంది. గొప్ప వ్యక్తుల సహకారం పొందుతారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. సోదర సోదరీమణులతో సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని ఉత్తమ విద్యార్థులుగా పేరు పొందుతారు.

పరిహారాలు: శ్రీ వెంకటేశవర స్వామి ఆరాధన చేసుకోండి.

 

తులారాశి:ఆకస్మిక ధన ప్రాప్తి పొందుతారు !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి పొందుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించి అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ప్రతి పరీక్షలో విజయం పొందుతారు. ఎంత కష్టమైన పనినైనా శ్రమపడి సరైన సమయానికి పూర్తి చేస్తారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు శ్రీహనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి:తక్కువ మాట్లాడడం మంచిది !

ఈరోజు అనుకూలంగా లేదు. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు వల్ల వస్తు నష్టం జరిగే అవకాశం ఉంది. మాట పట్టింపులు వల్ల నష్టపోతారు. మీరు చేసే తప్పులకు మీరే బాధ్యులు అవుతారు. తక్కువ మాట్లాడడం మంచిది. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మొండి బకాయిలు వసూలు కాక, అనవసర ఖర్చులు చేయడం వల్ల ధననష్టం జరుగుతుంది. విద్యార్థులు అధిక శ్రమ వల్ల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో క్రింది స్థాయి ఉద్యోగుల వల్ల ఇబ్బంది కలుగుతుంది. నమ్మిన వారు మోసం చేస్తారు. పిల్లల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది.

 

పరిహారాలుః ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించండి.

 

ధనస్సు రాశి:నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతి పొందుతారు. కార్యాలయాల్లో పదోన్నతి పొందుతారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండి రావాల్సిన డబ్బులు సమయానికి చేతికి అందడం వలన ధన లాభం కలుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. ఇంతకుముందు పోగొట్టుకున్న విలువైన వస్తువులను తిరిగి అందుకుంటారు. బంధువుల కలయికతో సంతృప్తి కలుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. మిత్ర లాభం పొందుతారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం పెట్టడం వలన అధిక లాభాలు కలుగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు శ్రీవిష్ణు సహస్రనామాలు పారాయణం చేసుకోండి.

 

మకర రాశి:ప్రయాణాలు అనుకూలిస్తాయి !

ఈ రోజు బాగుంటుంది. అప్పుల బాధలు తీర్చుకొని ధన ప్రాప్తి పొందుతారు. అనుకున్న పనులు సరైన సమయానికి పూర్తి చేసి కార్య లాభం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. స్నేహితుల వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. నూతన గృహానికి కొనుగోలు చేస్తారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః  ఈరోజు కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి:ధన లాభం కలుగుతుంది !

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తి చేసి కార్యసిద్ధి పొందుతారు. ధన లాభం కలుగుతుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. సోదరుల తో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఉన్నత వ్యక్తులతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకుంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు. వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

 

మీన రాశి:వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేయక నష్టం కలుగుతుంది. మీలో ఉన్న కోపం వలన మీరంటే ఇష్టపడే వారిని దూరం చేసుకుంటారు. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. వాహన ప్రమాదాలు కలుగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. రహస్యాలను బయటకు చెప్పడం వలన నష్టాలు కలుగుతాయి. విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండి, చదువు మీద శ్రద్ధ చూపడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించక పోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇతరులను దూషణ చేయడం వలన ఇబ్బందులు కలుగుతాయి.

పరిహారాలుః ఈ రోజు శివాష్టక పారాయణం చేసుకోండి. శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకోండి.

 

శ్రీ

 

 

 

TOP STORIES

ఐపీఎల్ 2021 షెడ్యూల్ విడుద‌ల‌.. మ్యాచ్‌లు జ‌రిగే తేదీలు ఇవే..!

కోవిడ్ నేప‌థ్యంలో గ‌తేడాది ఐపీఎల్ ఆల‌స్యంగా జ‌రిగినా ఈ ఏడాది మాత్రం అనుకున్న తేదీల‌కే ఐపీఎల్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ప్రేక్షకులు గ‌తేడాది వేస‌విలో ఐపీఎల్‌ను...