మీ జీవితంలో ఈ విషయాలని ఒప్పుకుంటే బాధపడాల్సిన అవసరం ఉండదు.

-

జీవితం అంటే సినిమా కాదు. మనకేదీ కావాలనుకుంటే అది చూసుకోవడానికి. మనకెలా కావాలనుకుంటే అలా ఉండడానికి. మనం చూసే సినిమాల్లో హీరోలు అన్నింటిలోనూ తోపులై ఉంటారు. ప్రతీ విషయం హీరోకి చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. సినిమా చూసి మనం కూడా అలా అవ్వాలనుకోవడం తప్పు కాకపోయినప్పటికీ, కొన్ని విషయాల్లో జీవితానికి, సినిమాకి చాలా తేడా ఉంటుందని తెలుసుకోవాలి.

అలా తెలుసుకోకుంటే బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. అలా బాధపడకుండా వాటిని ఒప్పేసుకుంటే హాయిగా ఉండొచ్చు. అలా ఒప్పేసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం.

మీ కంటే తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇతరులతో పోల్చుకోవడం అనవసరం.

ఈ లోకంలోని ప్రతీ ఒక్కరూ ఏదో ఒక విషయంలో అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి మీకున్న సమస్యకి బాధపడాల్సిన అవసరం లేదు.

ఏదీ చివరి వరకు ఉండదు. ప్రతీదీ మారుతుంది. జనం మారుతారు. కాలం మారుతుంది. నువ్వు మారుతావు.

కష్టపడితే విజయం వచ్చేస్తుందన్న గ్యారెంటీ లేదు. కానీ నీలో ఛాలెంజిని స్వీకరించే తత్వాన్ని పెంచుతుంది.

ప్రతీదీ తొందరగా అర్థం అవ్వాలన్న రూల్ లేదు. కొన్ని సార్లు కొన్ని అర్థం అవ్వడానికి టైమ్ పడుతుంది.

గతం గురించి బాధపడడం వర్తమానంలో సమయాన్ని వృధా చేయడమే.

ప్రతీదీ పర్సనల్ గా తీసుకోవద్దు.

ఏ విషయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలుసుకోకపోతే ఇబ్బందుల్లో పడేది నువ్వే.

ఏదైనా కావాలనుకుంటే మీ నుండి పూర్తిగా ఇవ్వండి. అలా ఇచ్చినపుడే మీకు కావాల్సింది దక్కుతుంది.

ఈ ప్రపంచంలో అన్నింటికంటే అత్యంత ముఖ్యమైనది, ఆవశ్యకమైనది ఏదైనా ఉందంటే అది మీ మీద మీకున్న నమ్మకమే. మీరెలాంటి వారైనా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మర్చిపోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news