ఫిబ్రవరి 23 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

Join Our Community
follow manalokam on social media

ఫిబ్రవరి 23 – మాఘ మాసం – మంగళవారం.

 

మేషరాశి:ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని, అనారోగ్యాలకు దూరంగా ఉంటారు. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకుంటుంది. లాభాలు కలుగుతాయి. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తొత్రం చదవుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:ఈ రోజు అనుకూలంగా ఉంటుంది !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. మిత్ర లాభం కలుగుతుంది. స్నేహితుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. ధనప్రాప్తి కలుగుతుంది. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. అధిక లాభాలు వస్తాయి .

పరిహారాలుః ఈరోజు శ్రీరామ నామ పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి:సంతోషంగా ఉంటారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అందరితో సఖ్యతగా  ఆనందంగా ఉంటారు. సోదరులతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. అయిన వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు.

పరిహారాలుః ఈరోజు కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి:పై అధికారుల మెప్పు పొందుతారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అయిన వారితో స్నేహితులతో,  కలిసిమెలిసి సఖ్యత గా ఉంటారు. గతంలో పోగొట్టుకున్న డబ్బులను, ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. ఇంతకుముందు గొడవలతో విడిపోయిన దంపతులు తిరిగి కలుసుకుంటారు. అన్యోన్యంగా ఉంటారు. ఇంట్లో ఏదో ఒక శుభకార్యాన్ని తలపెడతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల మెప్పు పొందుతారు. సోదర సోదరిమణులకు సఖ్యతగా ఆనందంగా ఉంటారు. వ్యాపారాలను విస్తరించుకుంటారు.  లాభాలు కలుగుతాయి. అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కార్యసిద్ధి పొందుతారు.

పరిహారాలుః ఈరోజు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. పిల్లల విషయంలో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో అయినా వారితో ఆనందంగా సఖ్యతగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీ పరీక్షల్లో ఉన్నతశ్రేణి మార్కులు పొందుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల లాభాలు కలుగుతాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. అప్పుల బాధలు తీరిపోతాయి. ధన యోగం కలుగుతుంది.

పరిహారాలుః ఈరోజు అన్నపూర్ణ అష్టకం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:స్వల్ప లాభాలు కలుగుతాయి !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు కష్టపడి చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. ఇతరులకు డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం అనుకూలించదు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. తల్లిదండ్రుల మాటలు వినడం వల్ల అన్నీ కలిసి వస్తాయి. సువర్ణ ఆభరణాలు విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది.

పరిహారాలుః ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

 

తులారాశి:అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలం. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. మీలో ఉన్న తొందరపాటుతనం వల్ల, కోపం వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. విద్యార్థులు చదువు విషయంలో అశ్రద్ధ చూపడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఎదుటి వారు చెప్పిన మాటలు వినడం వల్ల నష్టపోతారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ధననష్టం ఏర్పడుతుంది. చేపట్టిన ప్రతి పని విఘ్నాలు ఎదురై వాయిదా పడతాయి.

పరిహారాలుః ఈ రోజు శ్రీదుర్గాదేవిని ఆరాధించండి.

 

వృశ్చిక రాశి:పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని అనారోగ్య సమస్యలను పోగొట్టుకుంటారు.  విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో ఉన్నత హోదాలను పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని ఆరాధించండి.

 

ధనస్సు రాశి:నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉన్నత చదువులకు అర్హులవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. లాభాలు కలుగుతాయి. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. అయినా వారి ఆదరణ పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. వివాహ సంబంధ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

పరిహారాలుః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.ప

 

మకర రాశి:ఈ రోజు బాగుంటుంది !

ఈ రోజు బాగుంటుంది. చేపట్టిన ప్రతి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆనందంగా ఉంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. ధన యోగం కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు శ్రీకామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

 

కుంభరాశి:స్నేహితుల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. తొందరపడి మాట్లాడటం వల్ల కోపంగా ఉండడం వల్ల అయినా వారి దూరం అవుతారు. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. ప్రయాణాలు కలిసి రావు సోదరులతో విభేదాలు కలుగుతాయి. స్నేహితుల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి.

పరిహారాలుః  ఈ రోజు శ్రీలలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు !

ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో అందరితో ఆనందంగా, సఖ్యతగా ఉంటారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. రుణ బాధలు తీరిపోతాయి. ధన యోగం కలుగుతుంది. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఏర్పడుతుంది. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు భగవద్గీత పారాయణం చేసుకోండి లేదా కొన్ని శ్లోకాలను చదవండి.

 

  • శ్రీ

TOP STORIES

రూపాయి ఫీజు.. రిటైర్డ్ టీచర్ క్లాస్..!

రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు వృద్ధాప్య జీవితాన్ని ఏదోఒక కాలక్షేపంతో కానిచ్చేస్తుంటారు. మనవళ్లకు ఆటపాటలు నేర్పిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్...