జనవరి 25 సోమవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

శ్రీరామ జనవరి – 25- పుష్యమాసం- సోమవారం.

 

మేషరాశి:ఆర్థిక లాభాలు పొందుతారు !

ఈ రోజు బాగుంటుంది. మిత్రులతో కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు. అందరూ కలిసి విహార యాత్ర వెళ్లే అవకాశం ఉంది. అన్ని పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. కార్యసిద్ధి పొందుతారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన యోగం పొందుతారు. జాతర బాగా కష్టపడి చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. వ్యాపార పెట్టుబడులు పెట్టి ఆర్థిక లాభాలు పొందుతారు.

పరిహారాలుః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభరాశి:ధన లాభం పొందుతారు !

ఈ రోజంతా ఆనందంగా ఉంటుంది. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ధన లాభం పొందుతారు. అనుకున్న పనులు సరైన సమయంలో పూర్తి చేసి కార్యసిద్ధి పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. కొత్త వ్యాపార పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. లాభాలు పొందుతారు. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. వాహన కొనుగోలు చేస్తారు. దేవాలయ దర్శనం చేసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేసుకుని సంతోషంగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు లింగాష్టకం పారాయణం చేసుకోండి అంతా శుభప్రదంగా ఉంటుంది.

 

మిధునరాశి:ధననష్టం జరిగే అవకాశం !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. వివాదాలకు, చికాకులకు కోపానికి దూరంగా ఉండటం మంచిది. లేదంటే ఇబ్బంది. మిత్రులకు ఎవరికీ డబ్బులు ఇవ్వడం తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. వ్యసనాలకు దూరంగా ఉండండి. రైలు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. తక్కువగా మాట్లాడటం మంచిది.

పరిహారాలుః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి

 కర్కాటకరాశి:విలువైన వస్తువులను జాగ్రత్త !

ఈరోజు మీకు అనుకూలంగా లేదు. విద్యార్థులు విద్య మీదనే ఏకాగ్రత చూపడం మంచిది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అప్పులు ఇవ్వకండి, తీసుకోకండి. ఆభరణాలను ఎవరికీ ఇవ్వకుండా ఉండటం మంచిది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది.

పరిహారాలుః శ్రీదుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:ఈరోజు ధన లాభం పొందుతారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు బాగా చదువుకొని పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. మీరు ఈరోజు ధన లాభం పొందుతారు. గృహ స్థలం కొనుగోలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఈరోజు ధన లాభం. సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. వివాహ సంబంధ చర్చలు చర్చలు అనుకూలిస్తాయి.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:మొండి బకాయిలు వసూలు అవుతాయి !

ఈరోజు ఏ పనిలో అయినా తొందరపడకూడదు. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఈరోజు ధనయోగం పొందుతారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం పొందుతారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. వాహన కొనుగోలు చేస్తారు. పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆర్ధిక లాభాలు పొందే అవకాశం ఉంది. గృహ స్థలాన్ని కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈ రోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

తులారాశి:వాహనయోగం కలిగే అవకాశం !

ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులకు అందరితో కలిసి మెలిసి సంతోషంగా, సఖ్యతగా ఉంటారు. విద్యార్థులు బాగా చదువుకొని పరీక్షల్లో గరిష్ట మార్కులు తెచ్చుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. వాహనయోగం కలిగే అవకాశం ఉంది. గృహంలో  శుభ కార్యాలు అంటే యజ్ఞయాగాది క్రతువులు తలపెట్టే అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపార లాభాలు పొందుతారు. స్థిరాస్తులు పొందే అవకాశం ఉంది. మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు.

పరిహారాలుః ఈరోజు బిల్వాష్టకం పారాయణం చేసుకోండి.

 

 వృశ్చిక రాశి:వాహన ప్రయాణాలు జాగ్రత్త !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. లేదంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. తలపెట్టిన పనులన్నీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండాల్సిన రోజు.

పరిహారాలుః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. గోధుమలను దానం చేసుకోండి.

 

ధనస్సురాశి:స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం !

ఈ రోజు బాగుంటుంది. కొత్త వ్యాపార పెట్టుబడులు పెట్టడం వలన ఊహించని ధనలాభం కలుగుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు. ఆనందంగా సంతోషంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ముందుకుపోతారు. గొప్ప వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెద్ద వారి అనుమతితో ప్రేమ వివాహం ఫలిస్తుంది.

పరిహారాలుః ఈరోజు గణపతి ఆరాధన చేసుకోండి అంతా బాగుంటుంది.

 

 మకర రాశి:ఈ రోజు అంతా బాగుంటుంది !

ఈ రోజు అంతా బాగుంటుంది. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అభివృద్ధి. ధనలాభం పొందుతారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉత్తమ విద్యార్థులుగా నిలుస్తారు. విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు లభించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రుల అయ్యే అవకాశం ఉంది. మిత్ర లాభం.

పరిహారాలుః ఈరోజు దక్షిణామూర్తి స్వామి ఆరాధన చేసుకోండి.

 

కుంభరాశి:పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు !

ఈరోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గిపోయి ఆరోగ్యాన్ని పొందుతారు. సోదరులతో కలిసి మెలిసి ఉంటారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు. దైవ సంబంధ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాల్సిన రోజు. వైవాహిక సంబంధ విషయాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదాపడుతారు.

పరిహారాలుః ఈ రోజు సరస్వతి అమ్మవారి ఆరాధన చేసుకోండి.

 

 మీన రాశి:డబ్బుల విషయంలో జాగ్రత్త !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. శత్రువుల భయం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. ఏ విషయంలో అయినా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన రోజు. డబ్బుల విషయంలో జాగ్రత్త. కోపానికి అసహనానికి, చికాకులకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండండి. గ్రహచచలనాల రీత్యా విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండటం మంచిది.

పరిహారాలుః ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది.  పేదలకు తీపి పదార్థాలను దానం చేయండి.

 

  • శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news