మేషరాశి : అనుకూల ఫలితాలు, వస్త్రలాభం, వినోదదర్శనం, మిత్రులతో విందులు, ప్రభుత్వ మూలక ధనలాభం. పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేయండి మంచిది.
వృషభరాశి : అనుకూలం, శారీరక శ్రమ అధికం, పుణ్య కార్యాలను చేస్తారు, కొత్త పనులకు శ్రీకారం, ఆర్థికంగా పర్వాలేదు, ఆరోగ్యం, కుటుంబంలో సంతోషం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ ప్రదక్షణలు చేయండి.
మిథునరాశి : అనుకూలమైన రోజు, కొత్త వ్యక్తుల పరిచయం, పాత వస్తువులను అమ్ముతారు, ప్రయాణసూచన, ఇష్టమైనవారిని కలుస్తారు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ ప్రదక్షణలు చేయండి.
కర్కాటకరాశి : వ్యతిరేక ఫలితాలు, బాధలు, అనుకోని సంఘటనలు, ప్రయాణాలు వాయిదా, వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు, ఆన్నింటా అపజయాలు.
పరిహారాలు: అమ్మవారికి కుంకుమార్చన చేస్తే తప్పక మంచి ఫలితాలు వస్తాయి.
సింహరాశి : అనుకూలమైన రోజు, శుభవార్త శ్రవణం, ఆనందం, ఇష్టభోజన లభ్యం, కుటుంబ సంతోషం, భాగస్వామితో సరదాగా గడుపుతారు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, అమ్మవారి దేవాలయ దర్శనం మంచిది.
కన్యారాశి : పనుల్లో ఒత్తిడి, వస్తునష్టం, వస్త్ర నష్టం, పనులు వాయిదా, ఆరోగ్యంలో మార్పులు.
పరిహారాలు: అమ్మవారికి కుంకుమార్చన పూజ మంచి ఫలితాన్నిస్తుంది.
తులారాశి : ధనలాభం, పనులు పూర్తి, కుటుంబ సంతోషం, ఆర్థికంగా పర్వాలేదు. అమ్మకు ఆరోగ్యం, సోదరితో సంభాషణలు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, అమ్మవారి దేవాలయ దర్శనం చేయండి.
వృశ్చికరాశి : మిశ్రమ ఫలితాలు, బాధలు, ఆదాయ వృద్ధి, జ్వరపీడలు, ఔషధసేవ, ప్రయత్నకార్యాలు సఫలం.
పరిహారాలు: అమ్మవారికి కుంకుమార్చన చేస్తే మంచిది.
ధనస్సురాశి : ముఖ్యమైన వార్తలు వింటారు, సంతోషం, దేవాలయ దర్శనం, పనులు పూర్తి, అనుకోని సంఘటనలు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేస్తే మంచిది.
మకరరాశి : ఆకస్మిక మార్పులు, పెద్దవారితో లాభం, సౌఖ్యం, పనులు పూర్తి, ప్రయాణాలు కలసివస్తాయి, శుభవార్తా శ్రవణం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేస్తే తప్పక మంచి ఫలితాలు వస్తాయి.
కుంభరాశి : వ్యతిరేక ఫలితాలు, ధననష్టం, విచారం, కీడుచేస్తారు, అనవసర వివాదాలు, అధిక ఖర్చులు, ఆరోగ్యంలో మార్పులు.
పరిహారాలు: అమ్మవారికి కుంకుమార్చన చేయండి తప్పక మంచి జరుగుతుంది.
మీనరాశి : అలంకార వస్తులాభం, వ్యాపారంలో ఆటంకాలు, స్నేహితులతో విందులు, అనుకోని మార్పులు, ఆనందం, అలసట.
పరిహారాలు: అమ్మవారి దేవాలయంలో పూజలు, ప్రదక్షణలు చేయండి.
నోట్: నవగ్రహాలకు కనీసం 9 ప్రదక్షణలు చేయండి. అదేవిధంగా ఉప్పు పిడికెడు, నల్లపూలు అంటే వయ్‌లెట్ లేదా బ్లూరంగు పూలు అయినా పర్వాలేదు. తీసుకుని చేతిలో పట్టుకుని ప్రదక్షణలు చేసి నవగ్రహాల దగ్గర పెట్టివస్తే తప్పక మంచి జరుగుతుంది. ఈ తంత్రం చాలా కాలంగా ఉత్తరాదిలో విశేషంగా చేస్తుంటారు. శనిదోషం, కుజదోషంతోపాటు నరదృష్టివంటి వాటికి ఈ తంత్రం చాలా చక్కగా పనిచేస్తుంది.
– కేశవ