మార్చి 03 బుధవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

 

మార్చి- 3 – మాఘమాసం – బుధవారం. పంచమి.

మేష రాశి:శత్రువులు కూడా మిత్రులు అవుతారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో మార్కులు పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకున్న ప్రాంతాలకు బదిలీ అవుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. శత్రునాశనం కలుగుతుంది. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల సహకారం పొందుతారు. మిత్ర లాభం కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. లాభాలు కలుగుతాయి. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
పరిహారాలుః ఈరోజు బిల్వాష్టకం పారాయణం చేసుకోండి.

todays horoscope

వృషభ రాశి:ఈ రోజు అనుకూలంగా ఉంటుంది !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తిచేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. అప్పుల బాధలు తీరిపోతాయి. ధనయోగం కలుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు.
పరిహారాలుః ఈ రోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మిధున రాశి:ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఉన్నత హోదాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు, లేదా ప్రయత్నం ప్రారంభిస్తారు. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. సోదరులతో కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ వెంకటేశ్వర గోవింద నామాలు పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి:విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు బాగుంటుంది. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఉన్నత శ్రేణి మార్కులు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఉత్తమ ఉద్యోగులుగా పేరు పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు.
పరిహారాలుః ఈరోజు శ్రీ హయగ్రీవ స్తోత్రం పారాయణం చేసుకోండి.

సింహరాశి:ఊహించని కార్యసిద్ధి కలుగుతుంది !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఊహించని కార్యసిద్ధి కలుగుతుంది. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. రుణ బాధలు తీరిపోతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఇంతకుముందు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. ఉద్యోగార్థులు కార్యాలయాల్లో కోరుకున్న ప్రాంతాలకు బదిలీ అవుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి.
పరిహారాలుః ఈరోజు శ్రీ కృష్ణాష్టకం పారాయణం చేసుకోండి.

కన్యారాశి:ప్రమోషన్లు పొందుతారు !

ఈరోజు ఉపయోగకరంగా ఉంటుంది. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. దగ్గర్లో ఉన్న దేవాలయ దర్శనం చేసుకుంటారు. సోదరులతో ఆనందంగా సఖ్యతగా ఉంటారు. ఉద్యోగ కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని ఉన్నత విద్యలకు అర్హులవుతారు.
పరిహారాలుః ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి.

తులారాశి:ఆర్థిక లాభం కలుగుతుంది !

ఈరోజు ఆనందకరంగా వుంటుంది. ఇంతకుముందు పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి.  వివాహ నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయినవారి ఆదరణకు పొందుతారు. ఆర్థిక లాభం కలుగుతుంది. ప్రయాణ లాభాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. నీ మాటల వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ధనప్రాప్తి కలుగుతుంది.
పరిహారాలుః ఈరోజు మార్కండేయ స్వామిని ఆరాధించండి.

వృశ్చిక రాశి:ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలం. వాహన ప్రయాణాలు అజాగ్రత్త చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎదుటి వారికి డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం వల్ల నష్టం జరుగుతుంది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. కోపం వల్ల, తొందరపాటు తనం వల్ల మీకు సహాయం చేసే వారు దూరం అవుతారు. వివాహాది సంబంధం ప్రయత్నాలు అనుకూలించవు. విద్యార్థులం విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు. నష్టం కలుగుతుంది.
పరిహారాలుః  ఈరోజు మీరు శ్రీకాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి:ధనయోగం కలుగుతుంది !

ఈ రోజు బాగుంటుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. రుణ బాధలు తీరిపోతాయి. ధనయోగం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని అనారోగ్య సమస్యలను తగ్గించుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. అనుకున్న పనులను ఎంత కష్టమైన పనినైనా శ్రద్ధ పెట్టి సంతోషంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కార్యసాధన కలుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తులు అనుకూలిస్తాయి.
పరిహారాలుః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకర రాశి:అప్పుల బాధలు తీరిపోతాయి !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎదుటి వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అప్పుల బాధలు తీరిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు కలిసివస్తాయి. లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో అందరితో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రాణ స్నేహితులను కలుసుకుంటారు.
పరిహారాలుః ఈ రోజు ద్వాదశ జ్యోతిర్లింగ పారాయణం చేసుకోండి.

కుంభరాశి:కార్యసిద్ధి కలుగుతుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని అనారోగ్యానికి దూరంగా ఉంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. రుణ బాధలు తీరిపోతాయి. అవసరానికి చేతికి డబ్బులు అందుతుంది. ధన యోగం కలుగుతుంది. వివాహానికి సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.  ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గొప్ప పదోన్నతులు పొందుతారు.
పరిహారాలుః ఈరోజు దత్త చరిత్ర పారాయణం చేసుకోండి.

మీన రాశి:ఈరోజు శుభయోగం ఉంది !

ఈరోజు శుభయోగం ఉంది. చేపట్టిన పనులు సంతోషంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులం బాగా కష్టపడి చదువుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. ఉన్నత వ్యక్తుల పరిచయాలు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
పరిహారాలుః ఈరోజు నవగ్రహా స్తోత్రం పారాయణం చేసుకోండి

 

 

Read more RELATED
Recommended to you

Latest news