మార్చి 21 ఆదివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

మార్చి – 21- పాల్గుణమాసం – ఆదివారం

 

మేష రాశి:సంతాన విషయంలో శుభవార్తలు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. బాధలు తీరిపోతాయి. అవసరానికి డబ్బులు అందుతాయి. ధన యోగం కలుగుతుంది. వ్యాపారాల్లో అధిక ఆర్థిక లాభాలు. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో పదోన్నతులు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు.

పరిహారాలుః ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:కార్యాలయాల్లో ఇబ్బందులు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు, స్వల్ప నష్టాలు కలుగుతాయి. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల సమస్యలు ఏర్పడతాయి.

పరిహారాలుః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి:అనుకూలంగా ఉంటుంది !

ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు, ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. అధిక లాభాలు కలుగుతాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి.

పరిహారాలుః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి:అనవసర ఖర్చులు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. అనవసర ఖర్చులు అధికమవుతాయి. సమయానికి చేతికి డబ్బులు అందక ధననష్టం కలుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు అనుకూలించవు. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. కుటుంబంలో సమస్యలు. గర్భిణీ స్త్రీలకు ప్రమాద సూచనలు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి.

పరిహారాలుః శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:కార్యసిద్ధి కలుగుతుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. స్నేహితులతో, సోదరులతో సఖ్యతగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు సంతోష పరుస్తాయి.

పరిహారాలుః ఈరోజు శ్రీ లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:అధికారుల ఒత్తిడి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఇబ్బంది కలిగిస్తాయి. విలువైన పత్రాల మీద సంతకాలు నష్టపరుస్తాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించడం మంచిది. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి కలుగుతుంది. వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి.

పరిహారాలుః ఈ రోజు దుర్గాదేవి ని ఆరాధించండిజ

 

తులారాశి:ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది !

 

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సోదరులతో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గతంలో ఉన్న అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

పరిహారాలుః ఈరోజు జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని ఆరాధించండి.

 

వృశ్చిక రాశి:రుణబాధలు పెరుగుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. విద్యార్థులు అనవసరపు స్నేహితుల వల్ల విద్య మీద శ్రద్ధ కోల్పోతారు. రుణబాధలు పెరుగుతాయి. అనవసరపు ఖర్చులు ఎక్కువ అవుతాయి. ధననష్టం కలుగుతుంది. వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు అశ్రద్ధ చేయడం వల్ల నష్టం కలుగుతుంది.

పరిహారాలుః ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

ధనస్సురాశి:ఆర్థిక లాభాలు కలుగుతాయి !

ఈరోజు బాగుంటుంది. ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలిగిపోతాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల మన్ననలు పొందుతారు. సోదరులతో సఖ్యతగా ఉంటారు. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. క్రొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. పోటీపరీక్షల్లో ఉన్నత శ్రేణి మార్పులు పొందుతారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. గృహంలో శుభకార్యాన్ని తలపెడతారు.

పరిహారాలుః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మకర రాశి:ఆకస్మిక ధన లాభం కలుగుతుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో స్నేహితులతో అయిన వారితో సఖ్యత గా సంతోషంగా ఉంటారు. వ్యాపారాల్లో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార భాగస్వాములు అవుతారు. అధిక లాభాలు కలుగుతాయి.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి:శుభకార్యం తలపెడతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. వాహన సౌఖ్యం పొందుతారు. గృహంలో  ఏదో ఒక శుభకార్యం తలపెడతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని బాగుంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. కొత్త కొత్త ప్రాజెక్ట్ వర్క్ లు చేపడతారు. వ్యాపారాల్లో లాభాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

పరిహారాలుః ఈ రోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మీనరాశి:స్వల్ప లాభాలు కలుగుతాయి !

ఈరోజు సానుకూలంగా ఉంటుంది. మీలో ఉన్న తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల నష్టం కలుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి. అప్పులు ఇవ్వడం తీసుకోవడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. అనవసరపు విషయాలను చర్చించడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది.

పరిహారాలుః ఈ రోజు శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

  • శ్రీ