మే 31 రాశిఫ‌లాలు : అమ్మవారి దేవాలయంలో ప్రదోషకాల దీపారాధన చేస్తే ఈరాశులకు లాభం!

-

మేషరాశి : అనుకూలమైన రోజు, కుటుంబంలో సంతోషం, సమస్య పరిష్కారానికి చర్చలు, లాభం, పనుల్లో పురోగతి. ప్రయాణ సూచన.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేసుకోండి.

వృషభరాశి : మిశ్రమ ఫలితాలు,ఆరోగ్యంలో మార్పులు, కార్యజయం, అధిక ఆదాయం, బంధువుల కలయిక.
పరిహారాలు: అమ్మవారి దేవాలయంలో దీపారాధన చేయండి.

మిథునరాశి : అనుకూలత ఉండదు, కార్యనష్టం, కీర్తినష్టం, వాహనాలతో జాగ్రత్త, ప్రయాణాలు వాయిదా వేసుకోండి. కుటుంబంలో చిన్న ఇబ్బంది.
పరిహారాలు: అమ్మవారికి అష్టోతర పూజ, ప్రదక్షణలు చేయండి.

కర్కాటకరాశి : ధనానికి ఇబ్బందులు ఉండవు, అప్పులు తీరుస్తారు, కార్యజయం, చెడువార్తా శ్రవణం, ఆరోగ్యం, కుటుంబ సంతోషం.
పరిహారాలు: దుర్గాదేవి ఆరాధన, దీపారాధన చేస్తుంది.

సింహరాశి : పనులు అనుకూలం, కార్యజయం, సంతోషం, శుభకార్యాల వల్ల ఖర్చులు.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దైవనామస్మరణ చేయండి.

కన్యారాశి : వస్తునష్టం, సమస్యలు అధికం, కార్యభంగం, ప్రయాణాలు వాయిదా వేసుకోండి, అనవసర ఖర్చులు.
పరిహారాలు: అమ్మవారి దేవాలయంలో పూజ, దీపారాధన చేయండి.

తులారాశి : పరిస్థితులు అనుకూలం, అధికారుల సహకారం, ఆరోగ్యం, స్త్రీల వల్ల కార్యజయం, సంతోషం.
పరిహారాలు: అమ్మవారి పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది.

వృశ్చికరాశి : అధిక ఉత్సాహం, ఆకస్మిక ఆదాయం, కార్యజయం, విందులు, వినోదాలు.
పరిహారాలు: దేవాలయ ప్రదక్షణలు, దీపారాధన చేసుకోండి.

ధనస్సురాశి : శుభకార్యాల వల్ల ఖర్చులు, పనుల్లో ప్రతికూలత, ప్రయాణాలు తప్పనిసరి కాకుంటే వాయిదా వేసుకోండి. స్వల్ప అనారోగ్యం.
పరిహారాలు: అమ్మవారి దేవాలయంలో పూజ, ప్రదోషకాల ప్రదక్షణలు చేయండి.

మకరరాశి : బంధువుల రాక, సోదర వివాదం, ఆదాయానికి మించిన ఖర్చులు, కుటుంబంలో సంతోషం, ఆరోగ్యం.
పరిహారాలు: దేవాలయ ప్రదక్షణలు, దీపారాధన చేసుకోండి.

కుంభరాశి : కార్యలాభం, సంపదలు, అనుకోని మార్పులు, అనుకూలత,ఆరోగ్యం, కుటుంబ సంతోషం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన సరిపోతుంది.

మీనరాశి : లాభం, అలసట, అధికశ్రమ, పెద్దలతో వైరం, సమస్యలు ఎక్కువ అవుతాయి, అనవసర వివాదాలకు పోకండి.
పరిహారాలు: అమ్మవారికి అష్టోతర పూజ చేసుకోండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news