జగన్ సీఎం కావాలని పదేళ్లుగా ఈయన ఏం చేశాడో తెలుసా?

-

వైఎస్సాఆర్ కు ఆయన వీరాభిమాని. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజశేఖర్ రెడ్డిని విపరీతంగా గౌరవించేవారు. తర్వాత ఆయన కొడుకు జగన్ మోహన్ రెడ్డికి వీరాభిమానిగా మారాడు. జగన్ ఎలాగైనా ఏపీకి ముఖ్యమంత్రి కావాలని మనసులో అనుకున్నాడు.

అంతే.. జగన్ ముఖ్యమంత్రి అయ్యేవరకు చెప్పులు వేసుకోనని ప్రతిన పూనాడు. గత పదేళ్లుగా చెప్పులు లేకుండానే ఆయన జీవితం. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మళ్లీ పాదరక్షలు తొడుగుతానని అనుకున్నాడు. అదే విధంగా ఇవాళ తన దీక్షను విరమించి కాళ్లకు పాదరక్షలు తొడుక్కున్నాడు.

ఆయనే తెలంగాణలోని ఆదిలాబాద్ కు చెందిన బెజ్జంకి అనిల్ కుమార్. ఇవాళ వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక.. తన దీక్షను వీడారు.

అనిల్ కుమార్.. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. మే 23న ఎన్నికల ఫలితాలు విడుదల కాగానే.. ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన అభిమాన నేత ప్రమాణ స్వీకారం చేసిన విజయవాడలోనే అనిల్ కూడా తన దీక్షను విరమించి పాదరక్షలు ధరించాడు.

Read more RELATED
Recommended to you

Latest news