నవంబర్ 7 శనివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

నవంబర్‌ – 7 – ఆశ్వీయుజమాసం. శనివారం.

మేషరాశి: ఈరోజు గౌరవమర్యాదలు పొందుతారు !

ఈ రోజు మీకు చంద్రుడు ప్రయోజనం చేకూరుస్తాడు. ఫలితంగా మీరు శుభకార్యాల్లో చేరడానికి అవకాశం లభిస్తుంది. ఈ రోజు గౌరవ మర్యాదలు పొందుతారు. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజు కుటుంబ విషయాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. వైవాహిక జీవితంలో ఆనందంగా గడుపుతారు.

పరిహారాలు: శ్రీశ్రీనివాస నామాలను పఠించండి. వీలైతే నామాన్ని పెట్టుకోండి.

todays horoscope

వృషభరాశి: ఈరోజు విజయాలు సాధిస్తారు !

ఈరోజు దేవాలయం వంటి పవిత్ర స్థలాలను సందర్శించం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీకు నూతన ప్రాజెక్టులో మంచి జరగుతుంది. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఈ రోజు చివరిలో సమస్యలు ఉన్నప్పటికీ శక్తి పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం పెరుగుతుంది. కార్యాలయంలో మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు వైవాహిక జీవితంలో సాధారణంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.

 

మిథునరాశి: ఈరోజు సృజనాత్మకంగా ఉంటుంది !

మీకు ఆఫీస్‌లో కష్టపడి పనిచేస్తారు. ప్రశంసలు పొందుతారు. ఈ రోజు మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నూతన ప్రణాళికలు గుర్తుకు వస్తాయి. ఈ రోజు సృజనాత్మకంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు ప్రయోజనం పొందుతారు. స్నేహితుల నుంచి సహాయం అందుకుంటారు. దుబారా ఖర్చును నివారించండి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీ గణపతి సంకటమోచన స్తోత్రం పారాయణం చేయండి. అనుకూల ఫలితాలను పొందండి.

 

కర్కాటకరాశి: ఈరోజు అదృష్టం మీ వెంట ఉంటుంది !

ఈరోజు మీ కుటుంబం మీకు సహాయం చేస్తుంది. ఈ రోజు మీకు అంకితభావంతో ఏ పని చేసిని అదే సమయంలో విజయాన్ని పొందవచ్చు. ఈ రోజు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదృష్టం మీ వెంట ఉంటుంది. కార్యాలయంలో మీ ఆలోచనల ప్రకారం వాతావరణం సృష్టించుకోగలుగుతారు. మీ భాగస్వామి కూడా సహకరిస్తారు. విందులలో పాల్గొంటారు.

పరిహారాలుః నవగ్రహాలకు ప్రదక్షణలు, స్తోత్రం పారాయణం చేయండి.

 

సింహరాశి: ఈరోజు అధికారులతో జాగ్రత్త !

ఈ రోజు మీరు తీరిక లేకుండా గడుపుతారు. ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. అధ్యయనాల్లో విషయాల్లోనూ ప్రయోజనం అందుకుంటారు. మీరు ఎంచుకున్న రంగంలో పైఅధికారి నుంచి గొడవ ఉండవచ్చు. ఈ రోజు జీవిత భాగస్వామితో మీ సంబంధం మరితం బలంగా ఉంటుంది. ఇష్టమైన వంటకాలు రుచులు చూస్తారు.

పరిహారాలుః శ్రీపురుషసూక్తం పారయణం చేయండి. మంచి ఫలితాలు వస్తాయి.

 

కన్యారాశి: ఈరోజు కోపాన్ని నియంత్రించుకోండి !

ఈ రోజు మీరు జాగ్రత్తగా మసులుకోవాలి. చుట్టుపక్కల వ్యక్తులతో మీ వివాదాలు రాకుండా చూసుకోండి. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరముంది. ఈరోజు మీకు ఇష్టమైన పనులలో లీనమవ్వండి. మీరు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది.

పరిహారాలుః శ్రీకాలభైరవాష్టకం పారాయనం చేయండి.

 

తులారాశి: ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది !

మీ అన్ని వివాదాలను ఈ రోజు మీరు పరిష్కరించుకుంటారు. ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రయోజనం అందుకుంటారు. నూతన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. రియల్ ఎస్టేట్‌ విషయంలో అందోళన చెందుతారు. ఈ రోజు మీరు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో సాధారణంగా ఉంటుంది.

పరిహారాలుః  గోవిందనామాలను పారాయణం చేయండి.

 

వృశ్చికరాశి: ఈరోజు పనుల్లో లాభాలు పొందుతారు !

ఈరోజు మీరు కార్యశీలులుగా ఉండండి. ఇదే సమయంలో ప్రయత్నిస్తూ ఉండండి. ఈ రోజు సానుకూలంగా, బలంగా ఉంటుంది. అంతేకాకుండా రోజువారీ పనుల్లో లాభాన్ని అందుకుంటారు. కుటుంబంలో శాంతి, స్థిరత్వాన్ని ఆస్వాదించండి. వ్యాపారంలో కొత్త ఆలోచనలు చేయండి. దీనివల్ల భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. అదృష్టం కలసివస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది.

పరిహారాలుః శ్రీరామరక్షా స్తోత్రం చదవండి. లేదా వినండి.

 

ధనుస్సురాశి: ఈరోజు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. అన్ని పనులు, విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం విషయంలో మీరు కొంచెం రిస్క్ తీసుకుంటే పెద్ద లాభం వస్తుందనే ఆశ ఉంటుంది కానీ జాగ్రత్త. ఏదైనా పెట్టుబడి పెట్టడానికి ముందు అన్ని అంశాళను ఓ సారి పరిశీలించుకోవడం అవసరం. కొత్త అవకాశం మీకు చేరువలో ఉంది. దాన్ని గుర్తించడం మీపై ఆధారపడి ఉంటుంది. వైవాహిక జీవితం సాధారణం.

పరిహారాలుః దేవాలయంలో ప్రదక్షణలు,పేదలకు దానం, ధర్మం చేయండి.

 

మకరరాశి: ఈరోజు ఆందోళనలు మీ చుట్టు చేరుతాయి !

ఉమ్మడి భాగస్వామ్యంతో చేసిన పనులు లేదా వ్యాపారం నుంచి ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు. ఇంట్లో సంతానం గురించి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. చదువు, వివాహం వంటివి. ఏదైనా పెట్టుబడి పెట్టేటపుపడు ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచిది. నిజాయితీగా ఉండండి. ఆందోళనలు పెరగడానికి అవకాశం ఉంది.

పరిహారాలుః ఇష్టదేవతారాధనతోపాటు ప్రాణాయామం చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

 

కుంభరాశి: ఈరోజు ఆరోగ్యం జాగ్రత్త !

ఈరోజు ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఆహారం, పానీయాల విషయాల్లో అజాగ్రత్తగా ఉండకండి. వ్యాపారంలో ఇబ్బందులు రావచ్చు. పని విషయంలో ఆత్రుతలో పొరపాటు చేయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు ఎవరికీ అప్పులు ఇవ్వద్దు. వైవాహిక జీవితం సాధారణంగా గడిపోతుంది,

పరిహారాలుః శ్రీ కళ్యాణవేంకటేశ్వరస్వామి ప్రార్థన, ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

 

మీనరాశి: ఈరోజు వివాదాలకు దూరంగా ఉండండి !

మీరు ఏ విషయంలోనైనా స్నేహితులకు సాయం చేయవచ్చు. అంతేకాకుండా మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారంలో కష్టపడితే ప్రయోజనకరంగా ఉంటుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. వైవాహిక జీవితం సంతోషమయంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన, గోవిందనామాలను చదవడం వల్ల మంచి జరుగుతుంది.

 

-శ్రీ