డిసెంబర్‌ 19న విజయ ఏకాదశి …ఈ నాలుగు రాశుల వారికి లక్కే..

హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. డిసెంబర్ 19, 2022 చాలా మహత్యమైనది.. ఆ రోజు విజయ ఏకాదశి కావడంతో 3 శుభయోగాల అద్భుతం జరగనుంది. ఫలితంగా 4 రాశులకు అత్యంత శుభసూచకం కానుంది. ఆ రోజున వ్రతం ఆచరించి..విష్ణు భగవానుడిని పూజిస్తే..అంతా శుభం జరగడమే కాకుండా.. ప్రతి పనిలో విజయం లభిస్తుందని పండితులు అంటున్నారు. ఈ సందర్భంగా ఏయే రాశులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం..
విజయ ఏకాదశి రోజున ధనస్సు రాశిలో 3 శుభయోగాలు ఏర్పడనున్నాయి. బుధాదిత్య యోగం, లక్ష్మీ నారాయణ యోగం, త్రిగ్రహ యోగాల శుభ సంయోగం 4 రాశులకు అత్యంత శుభసూచకం కానుంది. ఈ సందర్భంగా ఏ రాశులకు శుభ సూచకం కానుందనే వివరాలు తెలుసుకుందాం..

వృషభరాశి..

విజయ ఏకాదశి నాడు ఏర్పడనున్న 3 శుభయోగాలు వృషభరాశి జాతకులకు అత్యంత శుభసూచకం కానుంది. ఈ జాతకులు ఊహించని విధంగా ధనలాభం కలగనుందట..కెరీర్‌లో భారీ విజయం లభిస్తుంది. మీ వాయిస్ మీకు ప్లస్ అవుతుంది. పెద్ద పెద్ద పనులను సైతం సులభంగా చేస్తారు. పెళ్లి గడియలు కూడా వచ్చేశాయండోయ్‌.

తులరాశి

డిసెంబర్ 19 నుంచి తులరాశి జాతకుల అదృష్టం ఒక్కసారిగా వికసిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో భారీ విజయం లభిస్తుంది. పదవి, డబ్బు, ప్రతిష్ట లభిస్తాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.

ధనస్సు రాశి

విజయ ఏకాదశి నాడు 3 శుభయోగాల అద్భుత సంయోగం ధనస్సురాశిలో ఏర్పడనుండటంతో.. ఊహించని అంతులేని సంపద లభిస్తుంది. ఈ జాతకాలవారికి భాగ్యం వికసిస్తుంది. పదోన్నతి లభిస్తుంది. భారీగా ధనలాభం కలుగుతుంది. నలువైపులా లాభాలు ఆర్జిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మీనరాశి

డిసెంబర్ 19 నుంచి మీనరాశి వారికి గోల్డెన్ డేస్‌గా చెప్పవచ్చు. ఉద్యోగం గురించి అణ్వేషించేవారికి కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి… పదోన్నతి లభిస్తుంది. కెరీర్‌లో లభించే గొప్ప అవకాశం జీవితాన్ని అద్భుతంగా మారుస్తుందట.. ధనలాభం కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఇది కేవలం పండితులు, జ్యోతిష్కులు చెప్పిన దాని ప్రకారమే అందించాం కానీ మనలోకం సొంతంగా రాసింది కాదని గమనించగలరు