ఈ నెల 23న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు..

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ ఈ నెలలోనే ఉంది. మొన్న ప్రై మెంబర్‌షిప్‌ సేల్‌తో ఆఫర్ల వెల్లువ ప్రకటించిన అమెజాన్‌ ఇప్పుడు గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌తో మళ్లీ వచ్చింది. ఈ ఆఫర్‌లో సోకాల్డ్‌ ప్రొడెక్ట్స్‌పై ఆఫర్లు గట్టిగానే ఉన్నాయి. ఇంతకీ వేటిపై డిస్కౌంట్లు ఉండబోతున్నాయో జర చూసేయండి మరీ.!

సెప్టెంబరు 23న అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ ప్రారంభం కానుంది. ఈ మెగా ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్, కిచెన్ అప్లయన్సెస్, టీవీలు, కిరాణా సామాగ్రి వంటి వివిధ కేటగిరీలకు చెందిన వస్తువులపై స్పెషల్ డీల్స్ ఉన్నాయి

తాజా సేల్‌కు సంబంధించిన ఆఫర్ల వివరాలను అమెజాన్ పూర్తిగా వెల్లడించలేదు. కేవలం సేల్ డేట్‌నే అనౌన్స్ చేసింది. రియల్‌మీ (Realme), షియోమి (Xiaomi), వన్‌ప్లస్‌(OnePlus) వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లపై అమెజాన్ డిస్కౌంట్లను అందించనుంది. నార్డ్‌ CE 2 Lite(Nord CE 2 Lite), నార్డ్‌ 2(Nord 2)మోడళ్లు తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. గెలాక్సీ ఫోల్డ్ సిరీస్, రెడ్‌మి ప్రైమ్ 11 5Gతో సహా కొత్తగా లాంచ్‌ అయిన ఫోన్‌లను సైతం అమెజాన్ విక్రయిస్తుంది.

యాపిల్‌ ఇటీవలే ఐఫోన్ 14ను లాంచ్‌ చేసింది. కాబట్టి ఈ సేల్‌లో ఐఫోన్ 13, ఐఫోన్ 12 మోడళ్ల ధరలు భారీగా తగ్గుతాయని అంచనా.. . అమెజాన్ తన వెబ్‌సైట్‌లో ఐఫోన్‌ 12పై భారీ డీల్‌లను అందించనున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ 12ను అమెజాన్‌ ధర రూ.52,999కి విక్రయిస్తోంది. డివైజ్‌ అసలు ధర రూ.65,990.

ఐఫోన్‌లపై స్పెషల్ డీల్స్..

యాపిల్‌ ఇటీవలే ఐఫోన్ 14ను లాంచ్‌ చేసింది. కాబట్టి ఈ సేల్‌లో ఐఫోన్ 13, ఐఫోన్ 12 మోడళ్ల ధరలు భారీగా తగ్గుతాయని భావిస్తున్నారు. అమెజాన్ తన వెబ్‌సైట్‌లో ఐఫోన్‌ 12పై భారీ డీల్‌లను అందించనున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ 12ను అమెజాన్‌ ధర రూ.52,999కి విక్రయిస్తోంది. డివైజ్‌ అసలు ధర రూ.65,990.

అదనంగా బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉంటాయి. ఐఫోన్‌ 13(iPhone 13), ఐక్యూ 9T(iQOO 9T) ప్రీమియం ఫోన్ల‌పై అమెజాన్‌ భారీ డిస్కౌంట్లను అందించనుంది. గ్రేట్ ఇండియన్ సేల్‌లో ఐఫోన్ 13 ధర రూ.53,000 నుంచి రూ.54,000 మధ్య ఉండవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ అదనంగా ఉంటాయి.

శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G(Samsung Galaxy M32 5G) రూ.15,000 నుంచి రూ. 20,000 మధ్య అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ 5G వేరియంట్‌ను ప్రస్తుతం అమెజాన్‌లో రూ.18,999కి సొంతం చేసుకోవచ్చు.

శామ్‌సంగ్ ఫోన్లపై..

శామ్‌సంగ్ గెలాక్సీ M32 5G(Samsung Galaxy M32 5G) రూ.15,000 నుంచి రూ. 20,000 మధ్య అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ 5G వేరియంట్‌ను ప్రస్తుతం అమెజాన్‌లో రూ.18,999కి సొంతం చేసుకోవచ్చు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్‌కాల్ సేల్ సమయంలో ధర ప్రస్తుత విక్రయ ధర కంటే తక్కువగా ఉంటుందని అంచనా. అమెజాన్ స్పెషల్ సేల్‌లో కస్టమర్లు ఫ్లాట్ డిస్కౌంట్స్‌తో పాటు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు, EMI ట్రాన్సాక్షన్స్‌పై 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై నో-కాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా అమెజాన్‌ అందిస్తోంది.

బ్యాంక్ ఆఫర్లు..

అమెజాన్ స్పెషల్ సేల్‌లో కస్టమర్లు ఫ్లాట్ డిస్కౌంట్స్‌తో పాటు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు, EMI ట్రాన్సాక్షన్స్‌పై 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై నో-కాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా అమెజాన్‌ అందిస్తోంది.