వాట్సాప్ యూజర్సప్ కు మరో గుడ్ న్యూస్.. మరో కొత్త ఫీచర్..

-

సోషల్ మీడియా యాప్ లలో ఎక్కువ మంది వాడుతున్న యాప్ లలో ఒకటి వాట్సాప్..ఈ యాప్ ఈ మధ్య కాలంలో డేటా చోరికి గురవుతున్న సంగతి తెలిసిందే.. ఈ మేరకు సరికొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో ఫీచర్ ను తీసుకోచ్చారు.తాజాగా మెసేజ్ రియాక్షన్ ఫీచర్‌ని జోడించిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో మనం ఈ ప్లాట్‌ఫారమ్‌లో మరో కొత్త ఫీచర్‌ను చూడబోతున్నాం. ‘చాట్ ఫిల్టర్’ అనే ఆప్షన్‌ను అందించేందుకు వాట్సప్ కృషి చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారుడు చాట్‌లను వివిధ క్యాటగిరీలను ఫిల్టర్ చేసే అవకాశాన్ని పొందుతాడు..

 

ఈ ఫీచర్ మెయిల్ సేవలకు ఉంటుంది.అందుకు భిన్నంగా ఈ ఫీచర్ ఉంటుంది.ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ బిజినెస్ క్లయింట్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మేరకు స్క్రీన్‌షాట్‌ను కూడా తాజాగా షేర్ చేసింది. త్వరలో మిగతా వినియోగదారులకు ఈ అవకాశం లభించనుంది. ఇందులో చదవని చాట్‌లు, కాంటాక్ట్, నాన్-కాంటాక్ట్, గ్రూప్ ఇలాంటివి ఉంటాయి. ఇక ఈ ఫీచర్ సహాయంతో, వినియోగదారులు తమ కథనాలను తమకు కావలసిన వ్యక్తులతో పంచుకోవచ్చు. అయితే వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ ఎప్పుడు వస్తుందనే దానిపై క్లారిటీ రాలేదు.

కాగా,ప్రస్తుతం ఈ ఆప్షన్ వెబ్ లేదా డెస్క్‌టాప్ వెర్షన్‌ వారికి అందుబాటులో వుంది.తాజా సమాచారం ప్రకారం ఈ ఫీచర్ iOS, Android వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా వాట్సాప్ ఇటీవల అనేక కొత్త ఫీచర్ల వివరాలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.. ఈ ఏడాది చివరి నాటికి ఎన్నో సరికొత్త ఫీచర్లు జోడించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా వివిధ సోషల్ మీడియా యాప్స్ యూజర్స్ ని ఆకట్టుకొనే దిశగా అడుగులు వేస్తున్నాయి..మిగిలిన వాటి కన్నా కూడా ఈ వాట్సాప్ యూజర్స్ ఎక్కువగానే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news