విద్యార్థుల‌కు యాపిల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఉచితంగా ఎయిర్‌పాడ్స్ ను పొందే అవ‌కాశం..!

టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ దేశంలోని విద్యార్థుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. యాపిల్ ఇండియా ఎడ్యుకేష‌న్ పేరిట అందిస్తున్న ఈ ఆఫ‌ర్ ద్వారా విద్యార్థులు ఉచితంగా ఎయిర్ పాడ్స్ ను పొంద‌వ‌చ్చు. ఇందుకు గాను విద్యార్థులు ప‌లు ఎంపిక చేసిన యాపిల్ ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రొడ‌క్ట్స్‌ను కొనుగోలు చేస్తే యాపిల్ ఎయిర్ పాడ్స్ ను ఉచితంగా పొంద‌వ‌చ్చు.

యాపిల్‌కు చెందిన మాక్‌బుక్ ఎయిర్‌, మాక్‌బుక్ ప్రొ, ఐమ్యాక్‌, మాక్ ప్రొ, మాక్ మినీ, ఐప్యాడ్ ప్రొ, ఐప్యాడ్ ఎయిర్ త‌దిత‌ర ప్రొడ‌క్ట్స్‌ను విద్యార్థులు కొనుగోలు చేస్తే ఉచితంగా ఎయిర్ పాడ్స్ ను పొంద‌వ‌చ్చు. వీటి ధ‌ర రూ.10వేల వ‌ర‌కు ఉంది.

ఈ ఆఫ‌ర్‌లో భాగంగా ప‌లు ఇత‌ర స‌దుపాయాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. యాపిల్ కేర్ ప్రొటెక్ష‌న్ ప్లాన్‌పై 20 శాతం త‌గ్గింపు ధ‌ర‌ను పొంద‌వ‌చ్చు. యాపిల్ పెన్సిల్‌, కీబోర్డుల‌పై డిస్కౌంట్‌ను అందిస్తారు. నెల‌కు కేవలం రూ.49కే యాపిల్ మ్యూజిక్ స్టూడెంట్ ప్లాన్‌, యాపిల్ టీవీ ప్ల‌స్ ప్లాన్‌ల‌ను అందిస్తారు. 3 నెల‌ల వ్య‌వ‌ధి గ‌ల యాపిల్ ఆర్కేడ్ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తారు. 3 నెల‌ల త‌రువాత నెల‌కు కేవ‌లం రూ.99 చెల్లిస్తే చాలు యాపిల్ ఆర్కేడ్ ప్లాన్‌లో కొన‌సాగ‌వ‌చ్చు.

దేశంలోని అన్ని కాలేజీలు, యూనివ‌ర్సిటీల‌కు చెందిన విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, అధ్యాప‌కులు ఈ ఆఫ‌ర్ కింద ఆయా ప్రొడ‌క్ట్స్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. రాయితీల‌ను పొంద‌వ‌చ్చు. మ‌రిన్ని వివ‌రాల‌కు యాపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.