బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్ ఇండియన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేసింది. దీని ధర విషయానికి వస్తే కేవలం రూ.2,999గా ఉంది. ఇది ఇండియాలోనే అత్యంత చౌకైన స్మార్ట్ రింగ్. ఇది గత ఏడాది స్టార్ట్ చేసిన బోట్ స్మార్ట్ రింగ్ అప్‌గ్రేడ్ వెర్షన్. ఇందులో మనకు చాలా ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లు అందించబడ్డాయి. డైలీ యూసేజ్ కోసం తయారు చేయబడిన ఈ రింగ్ బరువు 4.7 గ్రాములు ఉంటుంది. boAt కంపెనీ.. స్మార్ట్ రింగ్ యాక్టివ్ పై 1 ఇయర్ వారంటీని కూడా అందిస్తోంది.దీన్ని అమెజాన్, బోట్ వెబ్‌సైట్ నుండి బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్ ని కొనుగోలు చేయవచ్చు.
నిజానికి ఈ స్మార్ట్ రింగ్ అమ్మకాలు జూలై 20 నుంచి స్టార్ట్ కానుండగా.. ప్రస్తుతం ఈ రింగ్ రెండు వెబ్‌సైట్లలో ప్రీ బుకింగ్ కి అందుబాటులో ఉంది.ఈ స్మార్ట్ రింగ్ బాడీ విషయానికి వస్తే ఇది స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేయబడింది. ఇది 6 సైజ్ లు ఇంకా 3 కలర్ ఆప్షన్స్ లో ఉంటుంది. నలుపు, బంగారం, వెండి వంటి కలర్స్ లో ఈ రింగ్ అందుబాటులో ఉంటుంది.బోట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్ మీ హార్ట్ బీట్ రేటు, బ్లడ్ ఆక్సిజన్ స్థాయిని (SpO2) పర్యవేక్షించగలదు. అలాగే ఇది నిద్ర పర్యవేక్షణకు కూడా సపోర్ట్ ఇస్తుంది.
ఈ రింగ్ తో మీ వ్యాయామం, ఇతర రోజువారీ కార్యకలాపాలను కూడా ఈజీగా ట్రాక్ చేయవచ్చు. అంతేగాక రింగ్ 20+ కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ ఇస్తుంది. అలాగే మీ రోజువారీ స్టెప్స్ ని కూడా ఈ రింగ్ ద్వారా మీరు లెక్కించవచ్చు. అలాగే బోట్ రింగ్ యాప్ ద్వారా వినియోగదారులు డేటాను యాక్సెస్ చేయవచ్చు.ఇక వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌తో బోయాట్ స్మార్ట్ రింగ్ యాక్టివ్‌ను యాడ్ చేయవచ్చు. ఫొటోలను క్లిక్ చేయడానికి దానిని షట్టర్ బటన్‌గా దీన్ని వాడుకోవచ్చు.ఈ రింగ్ బండిల్ కేస్ ద్వారా మాగ్నెటిక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ని ఇస్తుంది. ఈ స్మార్ట్ రింగ్ 5 రోజుల దాకా బ్యాటరీ లైఫ్ అందించగలగుతుందని బోట్ కంపెనీ తెలిపింది.