బౌల్ట్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. కేవ‌లం రూ.999కే అదిరిపోయే వైర్‌లెస్ ఇయ‌ర్ బ‌డ్స్.. లాంచింగ్ ఆఫ‌ర్‌..!

ప్ర‌ముఖ ఆడియో ఉత్ప‌త్తుల త‌యారీదారు బౌల్ట్ కొత్త‌గా ఎయిర్‌బేస్ ఎక్స్‌పాడ్స్ పేరిట నూత‌న వైర్ లెస్ ఇయ‌ర్ బ‌డ్స్ ను లాంచ్ చేసింది. వీటిని అద్భుత‌మైన లుక్ వ‌చ్చేలా తీర్చిదిద్దారు. 13 ఎంఎం డ్రైవ‌ర్ యూనిట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ఇయ‌ర్ బ‌డ్స్ సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. డీప్ బేస్‌తో క్రిస్ప్ సౌండ్‌తో సంగీతం విన‌వ‌చ్చు.

బ్లూటూత్ 5.1 ద్వారా ఈ ఇయ‌ర్‌బ‌డ్స్ ప‌నిచేస్తాయి. ఐపీఎక్స్‌5 వాట‌ర్ రెసిస్టెన్స్‌ను ఈ బ‌డ్స్‌కు అందిస్తున్నారు. వీటికి సుల‌భ‌మైన ట‌చ్ కంట్రోల్స్ ను అందిస్తున్నారు. అందువ‌ల్ల సుల‌భంగా కాల్స్ ను ఆన్స‌ర్ లేదా రిజెక్ట్ చేయ‌వచ్చు. అలాగే వాల్యూమ్‌ను అడ్జ‌స్ట్ చేసుకోవ‌చ్చు. మ్యూజిక్ ట్రాక్స్ ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు.

ఫోన్ లో ఉండే వాయిస్ అసిస్టెంట్ కూడా ఈ ఇయ‌ర్‌బ‌డ్స్ ద్వారా ప‌నిచేస్తుంది. ఈ ఇయ‌ర్ బ‌డ్స్ ను ఒక్క‌సారి చార్జింగ్ చేస్తే 5 గంట‌ల పాటు నాన్‌స్టాప్‌గా వాడుకోవ‌చ్చు. కేస్‌తో అయితే 20 గంట‌ల వ‌ర‌కు బ్యాక‌ప్ ల‌భిస్తుంది. యూఎస్‌బీ టైప్ సి చార్జింగ్ పోర్టు ద్వారా చార్జింగ్ పెట్టుకోవ‌చ్చు.

బౌల్ట్ ఆడియో ఎయిర్‌బేస్ ఎక్స్‌పాడ్స్ ఇయ‌ర్ బ‌డ్స్ బ్లాక్, వైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తున్నాయి. లాంచింగ్ ఆఫ‌ర్ కింద వీటిని కేవ‌లం రూ.999కే అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ లో వీటిని కొనుగోలు చేయ‌వ‌చ్చు.