వాట్సాప్‌ చాట్‌బాట్‌.. కొత్తగా ఏమొచ్చినా చెప్పేస్తుంది!

-

వాట్సాప్ లో తరచూ ఓ కొత్త ఫీచర్ వస్తోంది. యూజర్ ఫ్రెండ్లీగా ఉండే వాట్సాప్ ఇతర మెసేజింగ్ యాప్ లను ఎప్పటికప్పుడు వెనక్కి నెట్టేస్తూ సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను వాట్సాప్ యూజర్లకు గిఫ్ట్ గా ఇవ్వబోతోంది ఈ సంస్థ. అదే.. వాట్సాప్ చాట్ బాట్. ఈ ఫీచర్ తో యూజర్లు వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్స్‌, ఫీచర్లు, ట్రిక్స్‌ గురించిన సమాచారం తెలుస్తుంది.
ఇప్పటిదాకా వాట్సాప్‌ ట్రిక్స్‌, కొత్త ఫీచర్‌ లేదా అప్‌డేట్ సమాచారం టెక్‌ పేజీలు, వాట్సాప్ ట్విటర్ లేదా బ్లాగ్‌ నుంచి తెలిసేది. ఇకపై వాట్సాప్‌ తన అధికారిక ఖాతా నుంచి చాట్‌బాట్‌ ద్వారా అప్‌డేట్స్‌, ఫీచర్లు, ట్రిక్స్‌, ప్రైవసీ అండ్‌ సేఫ్టీకి సంబంధించిన సమాచారం నేరుగా యూజర్‌కు తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ పరీక్షల దశలో ఉంది. ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లకు, తర్వాత ఐఓఎస్‌ యూజర్లకు పరిచయం చేయనున్నట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది.
యూజర్స్‌ వాట్సాప్‌ చాట్‌బాట్‌ సేవలు వద్దనుకుంటే సదరు వాట్సాప్‌ ఖాతాను బ్లాక్‌ చేయొచ్చు. యూజర్లకు మెరుగైన సేవలందించడంలో భాగంగా వాట్సాప్ ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. టెలిగ్రామ్‌, సిగ్నల్ వంటి మెసేజింగ్‌ యాప్‌లు ఇప్పటికే ఈ తరహా సేవలను అందిస్తున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని కొత్త ఫీచర్లను కూడా వాట్సాప్‌ పరీక్షిస్తోంది.
వీటిలో ప్రివ్యూ మెసేజ్‌ రియాక్షన్స్‌, పాస్ట్‌ పార్టిసిపెంట్స్‌, వాయిస్‌ మెసేజ్‌ స్టేటస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రివ్యూ మెసేజ్‌ రియాక్షన్స్‌తో ఎవరెవరు ఎమోజీలతో రిప్లై ఇచ్చారనేది తెలుసుకోవచ్చు. పాస్ట్ పార్టిసిపెంట్స్‌ ఫీచర్‌తో గ్రూపు నుంచి వెళ్లిపోయిన వారి గురించి తెలుసుకోవచ్చు. ఇక వాయిస్‌ మెసేజ్‌ స్టేటస్‌తో ఆడియో మెసేజ్‌లను కూడా వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news