ఎన్ని డివైజ్లలో మీ వాట్సాప్ లింక్ అయ్యి ఉందో ఇలా చెక్ చేసుకోండి..!

వాట్సాప్ ను ఉపయోగించడం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అలానే మనం మనకు నచ్చిన వాటిని సులభంగా ఇతరులతో షేర్ చేసుకోవడానికి కూడా అవుతుంది. వాట్సాప్ రోజు రోజుకీ కొత్త ఫీచర్లను తీసుకు వస్తూనే ఉంటుంది. వీటి ద్వారా మనం వాట్సాప్ ని మరింత సులభంగా, చక్కగా ఉపయోగించుకో వచ్చు. అయితే వాట్సాప్ ని కేవలం ఒక డివైస్ లో మాత్రమే కాకుండా మనకు నచ్చినన్ని డివైస్ లో యాక్సెస్ చేసుకోవచ్చు.

మల్టీ డివైస్ సదుపాయాన్ని కూడా వాట్సాప్ తీసుకు రావడం జరిగింది అయితే మరి ఎన్ని డివైజ్లలో మీ వాట్సాప్ అకౌంట్ ఉంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇలా ఈజీగా తెలుసుకోండి. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం పూర్తిగా చూద్దాం.

ప్రాథమిక డివైజ్ లో నెట్ కనెక్టివిటీ లేక పోయినా సరే ఇతర పరికరాల్లో అదే వాట్సాప్ అకౌంట్ ను వినియోగించుకోవచ్చు. ఏ వాట్సాప్ యూజర్ అయినా సరే అదనంగా నాలుగు డివైజ్ లలో ఒకటే వాట్సాప్ ఖాతాను వినియోగించుకో వచ్చు. ఒక్కోసారి మనం ఎన్ని డివైజ్లలో లాగ్ ఇన్ అయ్యాం అనేది మర్చిపోతాం. మీరు కూడా అలా మరచిపోతే ఎన్ని డివైజ్లలో లాగ్ ఇన్ అయ్యారు అనేది ఇలా చూసుకోండి. దీన్ని ఫోన్ నుంచే చేసుకోవచ్చు.

ఐ ఫోన్ యూజర్స్ ఇలా చెయ్యండి:

ఐ ఫోన్ యూజర్లు వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయాలి.
నెక్స్ట్ దిగువన కుడి భాగంలో సెట్టింగ్స్ కు వెళ్లాలి.
సెట్టింగ్స్ మెనూలో లింక్డ్ డివైజెస్ ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చెయ్యాలి.
మీ వాట్సాప్ ఏ ఏ పరికరాలకు లింక్ చేసి ఉందన్నది ఇలా తెలుస్తుంది.
మీరు ఇక్కడ లాగవుట్ చేయాలనుకున్న పరికరాన్ని ఎంపిక చేసుకుని లాగవుట్ చేసేయచ్చు.

ఆండ్రాయిడ్ యూజర్లు ఇలా చెయ్యండి:

ముందు వాట్సాప్ యాప్ ను తెరవాలి.
కుడి చేతి వైపు పై భాగంలో కనిపించే మూడు చుక్కల పై క్లిక్ చెయ్యండి.
లింక్డ్ డివైజెస్ ఆప్షన్ ఉంటుంది.
ఇప్పుడు మీకు ఎక్కడెక్క లింక్ చేసిందన్నది తెలుస్తుంది.
నచ్చిన దానిని ఎంచుకుని లాగవుట్ చేస్తే సరిపోతుంది.