చైనాలో సిగ్నల్‌ యాప్‌ బ్యాన్..‌ ఎందుకంటే?

-

వాట్సప్‌కు ప్రత్యమ్నాయ సిగ్నల్‌ యాప్‌ను చైనా బ్యాన్‌ చేసింది. ఇప్పటికే ఫేస్‌ బుక్, ట్విట్టర్, గూగుల్‌ యాప్స్‌ ను బ్యాన్‌ చేసిన చైనా తాజాగా సిగ్నల్‌ యాప్‌ను నిషేధించింది. టిక్‌ టాక్‌ను పలు దేశాలు బ్యాన్‌ చేసిన నేపథ్యంలో ఇప్పుడు సిగ్నల్‌ యాప్‌ను చైనా బ్యాన్‌ చేయడం సంచలనంగా మారింది. వినియోగదారుల గోప్యతే ముఖ్యంగా మార్కెట్లోకి అడుగు పెట్టిన సిగ్నల్‌ యాప్‌ ను ప్రముఖ పారిశ్రామిక వేత్త టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ సిఫార్సు చేయడంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

దీనిలో ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజింగ్‌ సర్వీసు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చైనాలో చాలా వరకూ అమెరికాకు చెందిన పలు యాప్స్‌ బ్యాన్‌ అయ్యాయని, ఇçప్పటికే గూగుల్‌ బ్రౌజర్‌ బ్యాన్‌ చేసిన దేశంగా చైనా వార్తల్లోకి ఎక్కింది. అయితే చైనాలోని సర్కారు తమ ప్రజల ఇంటర్నెట్‌ వాడకంపై నియంత్రణ ఉంచుతుంది. అందుకే అంతర్జాతీయ వెబ్‌ సైట్స్‌ వారి దేశంలోకి ప్రవేశించకుండా ‘గ్రేట్‌ ఫైర్‌వాల్‌’ అనే సాఫ్ట్‌ వేర్‌ ద్వారా వారి సైబర్‌ విభాగం పలు వెబ్‌ సైట్లను అడ్డుకుంటుంది. అయితే వాట్సప్‌ కు ప్రత్యామ్నాయంగా వచ్చిన సిగ్నల్‌ యాప్‌ ను చాలా దేశాలు వాడుతున్నాయి. అటు చైనాలో కూడా దీన్ని డౌన్‌ లోడ్‌ చేసుకున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

అలాగే ఎలాన్‌ మస్క్‌ లాంటి దిగ్గజ టెక్‌ కంపెనీ వ్యవస్థాపకుడు సిగ్నల్‌ యాప్‌ ఉపయోగించాలని ట్విట్టర్‌లో పిలుపునివ్వడంతో ఈ మెసేజింగ్‌ యాప్‌కు విశేష ఆదరణ లభించింది. ఇప్పటికే చైనాలో గూగుల్‌ కు బదులుగా ‘బైదు’ అనే బ్రౌజర్‌ నడుస్తుండగా, ఫేస్‌ బుక్‌ కు కూడా ప్రత్యామ్నాయ వెబ్‌ సైట్స్‌ ఉన్నాయి. చైనాలో సోషల్‌ మీడియాపై ప్రభుత్వ నిఘా ఉంటుంది. ముఖ్యంగా పౌరులకు సంబంధించి ఏ వివరాలను గోప్యతగా పరిగణించరు. ఈ నేపథ్యంలోనే చైనా ఇష్టారాజ్యంగా యాప్స్‌ డిలీట్‌ చేస్తోంది. అయితే ఇప్పటికే చైనాకు చెందిన పలు యాప్స్‌ ప్రపంచంలోని పలు దేశాల్లో బ్యాన్‌ అవ్వడం గమనించాల్సిన విషయం.

Read more RELATED
Recommended to you

Latest news