IND Vs NZ : బెంగళూరు టెస్ట్ మ్యాచ్ లో సర్ఫరాజ్ సెంచరీ

-

టీమిండియా బ్యాట్స్ మెన్ సర్ఫరాజ్ ఖాన్ న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో   తొలి సెంచరీ నమోదు చేశాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న రెండో ఇన్నింగ్స్ లో సర్ఫరాజ్ ఖాన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి ఇన్నింగ్స్ లో డకౌట్ అయిన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్ లో తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. రకరకాల పంచ్, పవర్ స్ట్రోక్స్ తో కివీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. ఒకవైపు ఘోరమైన పరాభవం తప్పదు అనుకున్న దశలో సర్పరాజ్ సెంచరీతో చెలరేగాడు.

వాస్తవానికి మ్యాచ్ పై కివీస్ కే పట్టు ఉన్నప్పటికీ.. సర్పరాజ్ మాత్రం నాలుగో రోజు సెంచరీ చేశాడు. 11 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో సర్ఫరాజ్ తన సెంచరీ చేశాడు. కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తున్న న్యూజిలాండ్ ను తన స్ట్రోక్ ప్లే తో సర్పరాజ్ నిలువరించాడు. ఫీల్డర్ల మీద నుంచి షాట్లు కొడుతూ.. కివీస్ ఫీల్డర్లను నెట్టేశాడు.  ప్రస్తుతం భారత్ స్కోరు 294/3.  సర్ఫరాజ్ (107), పంత్(23)  క్రీజులో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version