స్మార్ట్ టెక్ పరికరాల తయారీదారు గోకి (Goqii) కరోనా లక్షణాలను తెలియజేసే ఓ నూతన స్మార్ట్‌బ్యాండ్‌ను తాజాగా భారత్‌లో విడుదల చేసింది. GOQii Vital 3.0 పేరిట విడుదలైన ఈ బ్యాండ్ మన శరీర ఉష్ణోగ్రత వివరాలను తెలియజేస్తుంది. ప్రపంచంలోనే ఈ తరహా ఫీచర్ కలిగిన మొదటి స్మార్ట్ బ్యాండ్ ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో కరోనా లక్షణాలను ఈ బ్యాండ్‌తో ఆరంభంలోనే గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.
గోకి వైటల్ 3.0 స్మార్ట్‌బ్యాండ్‌లో కింది ఫీచర్లను అందిస్తున్నారు..
* స్టెప్ ట్రాకర్, డిస్టాన్స్ ట్రాకర్, యాక్టివ్ టైం, క్యాలరీ బర్న్‌డ్ ట్రాకర్
* ఆటో స్లీప్ ట్రాకింగ్, బాడీ టెంపరేచర్ మీజర్‌మెంట్, బ్లడ్ ప్రెషర్ మీజర్‌మెంట్
* 24 * 7 హార్ట్ రేట్ మానిటరింగ్, మల్టిపుల్ ఎక్సర్‌సైజ్ మోడ్
* కాల్స్, వాట్సాప్, ఫేస్‌బుక్ నోటిఫికేషన్స్
* అలారం, ఇనాక్టివిటీ, వెదర్ అలర్ట్స్
* వాటర్ ప్రూఫ్, బిల్టిన్ యూఎస్‌బీ చార్జర్
* 10 నుంచి 15 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్
GOQii Vital 3.0 స్మార్ట్‌బ్యాండ్‌ను రూ.3,999 ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. GOQii ఇండియా ఆన్‌లైన్ సైట్‌లో ఈ బ్యాండ్‌ను విక్రయిస్తున్నారు. త్వరలోనే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలోనూ ఈ బ్యాండ్‌ను విక్రయించనున్నారు.