మొబైల్ ఫోన్ లో బ్యాటరీలు కాలిపోవడానికి గల ఐదు కారణాలివే..!

-

ఈ మధ్యకాలంలో ఫోన్స్ పేలిపోవడాన్ని మనం చూస్తున్నాం దాని వల్ల చాలా మంది తీవ్రంగా గాయపడుతున్నారు. కొన్ని అరుదైన సందర్భాలలో అయితే ప్రాణాలు కూడా పోతున్నాయి. అయితే అసలు స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎందుకు పేలిపోతుంది..?, ఎందుకు మంటలు వస్తాయి దీని వెనుక ఉండే ఐదు కారణాల గురించి ఇప్పుడు చూద్దాం.

 

ఎక్కువ సేపు హై టెంపరేచర్ లో ఫోన్ ని వదిలేయడం:

స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు కొన్ని టెంపరేచర్ లలో పనిచేసేలా రూపొందించడం జరుగుతుంది. టెంపరేచర్ ఎక్కువగా ఉండే చోట ఎక్కువసేపు ఫోన్ వదిలేయడం వల్ల బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది. అలానే ఫోన్ వేడెక్కి పోవడానికి కూడా కారణమవుతుంది. మీరు సూర్యుడి కిరణాలు పడేటట్టు ఎక్కువసేపు వదిలేసినా లేదంటే కారులో ఎక్కువసేపు వదిలేసినా ఫోన్స్ ఓవర్ హీట్ అయిపోయి బ్యాటరీ లో ఉండే సెల్స్ అన్ స్టేబుల్ అవుతాయి దీంతో బ్యాటరీ కార్బన్డయాక్సైడ్ మరియు ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీనితో ఫోన్ పేలిపోవడం మంటలు రావడం లాంటివి జరుగుతాయి.

రాత్రంతా ఛార్జింగ్ పెట్టి వదిలేయడం లేదా ఛార్జింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ వాడడం:

ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టి అలా వదిలేసినా సరే వేడెక్కిపోతుంది. దీనివల్ల కూడా పేలిపోయే అవకాశం ఉంటుంది. చార్జింగ్ లో పెట్టి ఫోన్ వాడడం వల్ల కూడా వేడెక్కి మంటలు వచ్చే అవకాశం వుంది లేదా ఫోన్ పేలిపోతుంది.

ఇతరుల చార్జర్ వాడడం:

ఎవరి స్మార్ట్ ఫోన్ చార్జర్ ని వారే ఉపయోగించాలి మరొక బ్రాండ్ చార్జర్ ని వాడడం వల్ల కూడా ఫోన్ పేలిపోయే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఫోన్ పేలిపోవడానికి ఒక కారణం. స్మార్ట్ ఫోన్ డ్యామేజ్ అవ్వడం స్మార్ట్ ఫోన్ యొక్క అవుటర్ బాడీ డామేజ్ అయినా సరే ఇలాంటివి ఇబ్బందులు కలుగుతాయి. ఇలా బ్యాలెన్స్ జరగకపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ లాంటివి అవుతాయి. ఫోన్ వేడెక్కి మంటలు వ్యాపిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news