తెలియకపోతే గూగుల్ పే, పేటీఎం వాడొద్దు…!

-

గూగుల్‌పే, పేటీఎం వంటి యాప్‌ల వినియోగం అనేది ఈ మధ్య కాలంలో క్రమంగా పెరిగిపోయింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. దాదాపు అందరూ వాటిని వాడుతున్నారు. వ్యాపార,ఉద్యోగ, విద్య, షాపింగ్ ఇలా ఎక్కడ చూసినా సరే వాటిని వినియోగం పెరిగిపోయింది. మన ఖర్మకు వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ కూడా ఆకట్టుకుంటూనే ఉన్నాయి. దీనితో వాటి వాడకం అనేది ఎక్కువైపోయింది అనేది వాస్తవం.

అయితే వాటిని వినియోగిస్తున్న చాలా మంది అవగాహన లేక కొంపలు ఆర్పెస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లకు బ్యాంక్‌ ఖాతాలు, ఓటీపీ వివరాలు వాళ్ళు అడిగిన వెంటనే ఆత్రంగా ఏదో ఆశతో చెప్పి మోసపోతున్నారు. కేవలం గత నెలలో ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు 150కి పైగా ఫిర్యాదులు వచ్చాయి పోలీసులకు. వారిలో వెయ్యి రూపాయల నుంచి రూ. 20 వేలు పోగొట్టుకున్న బాధితులే ఎక్కువ మంది ఉన్నారు.

బ్యాంక్‌ ఖాతాలు, ఓటీపీ వివరాలు ఎవరికీ చెప్పొద్దని ఎన్ని విధాలుగా ప్రచారం చేస్తున్నా జనం మారే పరిస్థితి కనపడటం లేదు. బ్యాంక్‌లు కూడా తమ ఖాతాదారులు ఓటీపీ నంబర్లు ఇతరులకు చెప్పవద్దని ఎన్ని విధాలుగా ప్రచారం చేసి అవగాహన కల్పించినా సరే మారడం లేదు. అసలు మీకు తెలియనప్పుడు వాటిని వాడకుండా ఉండటం మంచిది. సంపాదించుకున్న సొమ్ముని ఈ విధంగా పోగొట్టుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news