నగ్నచిత్రాలు పంపితే ‘బ్లర్‌’ అవుతాయి.. ఇన్ స్టాగ్రామ్ లో క్రేజీ ఫీచర్!!

-

సోషల్ మీడియాలో లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌ ఓ సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. యువత రక్షణ కోసం తాము కొత్త టూల్‌ను ప్రవేశడుతున్నామని ఈ సంస్థ ప్రకటించింది. డైరెక్ట్‌ మెసేజ్‌ కింద నగ్న చిత్రాలను పంపిన సమయంలో ఈ టూల్‌ వాటిని ఆటోమెటిక్‌గా బ్లర్‌ చేస్తుందని తెలిపింది. లైంగిక కుంభకోణాలు, ఇతర మార్గాల్లోని చిత్రాల దుర్వినియోగంపై ప్రచారంలో భాగంగా తాము కొత్త ఫీచర్లను పరీక్షిస్తున్నామని వెల్లడించింది. టీనేజ్‌ వారిని నేరస్థులు సంప్రదించడం కఠినతరం చేస్తున్నామని స్పష్టం చేసింది.

లైంగిక దోపిడీలో భాగంగా నేరస్థులు డైరెక్ట్‌ మెసేజ్‌ మార్గంలో నగ్నచిత్రాలు పంపేలా అవతలి వారిని ఒప్పిస్తారని, అనంతరం డబ్బులు ఇవ్వకుంటే లేదా లైంగిక పరమైన అంశాల్లో తాము చెప్పినట్లు వినకుంటే వాటిని ఆన్‌లైన్‌లో ఉంచుతామని బెదిరిస్తారని ఇన్స్టాగ్రామ్ పేర్కొంది. స్కామర్లు చాలా సందర్భాల్లో ‘సన్నిహిత చిత్రాలు’ పొందేందుకు డైరెక్ట్‌ మెసేజ్‌ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని, అయితే డైరెక్ట్‌ మెసేజ్‌ నగ్నత్వ రక్షణ సదుపాయాన్ని తాము పరీక్షిస్తున్నామని తెలిపింది. ఎవరైనా డైరెక్ట్‌ మెసేజ్‌లో నగ్న చిత్రాలను పంపితే ఈ ఫీచర్‌ వాటిని బ్లర్‌ చేస్తుందని వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news