జియో కాల్స్ ఉచితం కాదిక‌.. కాల్ చేస్తే చార్జీలు పడతాయి

-

ఇప్పటిదాకా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాల్స్‌ సదుపాయం అందిస్తున్న టెలికం సంస్థ రిలయన్స్‌ జియో (జియో) తాజాగా చార్జీల వడ్డనకు తెరతీసింది. జియో నెట్‌వర్క్‌లోని నంబర్లకు చేసే కాల్స్‌ మాత్రమే ఉచితం. ఇతర మొబైల్‌ నెట్‌వర్క్‌ నంబర్లకు కాల్‌ చేస్తే నిమిషానికి 6 పైసల చొప్పున వసూలు చేయనున్నట్లు బుధవారం జియో ప్రకటించింది. జియో సొంత నెట్ వర్క్ కాల్స్ కు మాత్రం ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపింది.

అలాగే, ఇన్ కమింగ్ కాల్స్, ల్యాండ్ లైన్ కాల్స్, వాట్సాప్ కాల్స్ కు ఈ ఛార్జీలు వర్తించవని వివరించింది. ఈ నిబంధన వచ్చే ఏడాది జనవరి 1 వరకూ అమల్లో ఉండనుంది. దీనివల్ల ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్‌ కాల్స్‌ చేయదల్చుకునే వారు ఐయూసీ టాప్‌–అప్‌ వోచర్స్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టాప్‌ అప్‌ వోచర్స్‌ విలువకు సరిసమానమైన డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు, దీంతో నికరంగా యూజరుపై చార్జీల భారం ఉండబోదని జియో తెలిపింది.

టాప్ అప్ ఓచర్ లు ఇలా..
– రూ. 10 ప్లాన్‌: 124 నిమిషాలు. 1 జీబీ డేటా.
– రూ. 20 ప్లాన్‌: 249 నిమిషాలు. 2 జీబీ డేటా.
– రూ. 50 ప్లాన్‌: 656 నిమిషాలు. 5 జీబీ డేటా.
– రూ. 100 ప్లాన్‌: 1,362 నిమిషాలు. 10 జీబీ డేటా.

Read more RELATED
Recommended to you

Latest news