టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ‘జియో డేటా ప్యాక్ ఆఫర్’ కింద యూజర్లందరికీ 8జీబీ డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. 4 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా చొప్పున జియో ఉచిత డేటాను తన కస్టమర్లకు అందిస్తోంది. వర్క్ ఫ్రం చేస్తున్న ఉద్యోగులతోపాటు, ఇండ్లలో ఉంటున్న జనాలు ఇప్పుడు ఎక్కువగా ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్న నేపథ్యంలో జియో ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది.
జియో అందిస్తున్న ఉచిత డేటాను చూడాలంటే.. మై జియో యాప్‌లోకి లాగిన్ అయ్యి.. అందులో మై ప్లాన్ అనే విభాగంలోకి వెళ్లాలి. అక్కడే ప్రస్తుతం యాక్టివేట్ అయి ఉన్న ప్లాన్ కింద లేదా పైన ఉచిత డేటా 2జీబీ యాడ్ అయింది మనకు కనిపిస్తుంది. ఇక ఈ ఆఫర్‌ను జియో ఏప్రిల్ 27వ తేదీనే యాక్టివేట్ చేసినా.. చాలా మందికి తెలియదు. కనుక ఈ ఆఫర్ మీకు ఉందా, లేదా తెలుసుకోవాలంటే.. మై జియో యాప్‌లో ముందు చెప్పిన విధంగా లాగిన్ అయ్యి.. ఆఫర్ వివరాలను తెలుసుకోవచ్చు. ఆ ఆఫర్ ఎప్పటి వరకు ఉంది.. అనే తేదీ కూడా ఆ ఆప్షన్లలో తెలుస్తుంది.
ఇక ప్రస్తుతం వాడే ప్లాన్‌లోని డేటా అయిపోగానే వినియోగదారులు ఈ డేటాను ఉపయోగించుకునేందుకు వీలుంటుంది. అంటే.. ఉదాహరణకు ఒక కస్టమర్ నిత్యం 1.50 జీబీ డేటా ప్లాన్‌ను వాడుతున్నాడనుకుంటే.. ఆ డేటా అయిపోగానే పైన తెలిపిన ఉచిత డేటాను యూజ్ చేసుకోవచ్చన్నమాట. ఇలా ఈ ఆఫర్ కింద వచ్చే డేటాను యూజర్లు వాడుకోవచ్చు..!