జియో మరో సంచలనం.. అతి తక్కువ ధరలకే స్మార్ట్‌ఫోన్లు!

Join Our Community
follow manalokam on social media

వినూత్న ప్రయోగాలతో ముందుకు వచ్చే ఈ సారి కూడా వినియోగదారులకు మరో సంచలనాన్ని ముందుకు తీసుకువచ్చింది. అదే అతి తక్కువ ధరకే స్మార్ట్‌ ఫోన్లను అందుబాటులోకి తీసుకురానుంది. టెలికాం దిగ్గజం తన సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడానికి సంస్థ ఈ సరికొత్త వ్యూహాలతో రెడీ అవుతోంది. ఇది వరకే తక్కువ ధరలకే రీచార్జ్‌ ప్లాన్లను వినియోగదారులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.


ఇలా చేయడం ద్వారా యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌(ARP) పెరుగుతుందని భావిస్తున్నారు. దీంతో మార్కెట్లో తనకు తిరుగు లేదని మరో సారి నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుంది. కొన్ని రోజుల నుంచి సోషల్‌ మీడియాలో జీయో స్మార్ట్‌ ఫోన్లు వస్తాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో సర్వత్రా ఆసక్తి పెరిగింది. ఈ ఫోన్ల కోసం చాలా మంది స్మార్ట్‌ ఫోన్‌ లవర్స్‌ ఎదురుచూస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.

అదేవిధంగా ‘జియో బిజినెస్‌’ పేరుతో సరికొత్త ఫైబర్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్లను జియో ప్రకటించింది. ఇది చిన్న తరహా వ్యాపారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్‌లో రూ.901 ఛార్జీలతో ప్రారంభమవుతుంది. వివిధ ప్లాన్లకు సంబంధించిన వేర్వేరు బెనిఫిట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్లలో నిరంతర వాయిస్‌ కాల్స్, ఫిక్స్‌డ్‌ మొబైల్‌ కన్వర్జెన్స్, స్టాటిక్‌ ఐపీ, జియో అటెండెన్స్‌ ఇతర డివైజ్‌లు అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఈ ప్లాన్‌లో రూ. 10,001 వరకు అందుబాటులో ఉంది. భారత్‌లో ఎక్కడైన వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు.

  • జియో బిజినెస్‌ రూ.1,201 ప్లాన్‌తో 150 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో నిరంతర కాల్స్‌ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ద్వారా లభిస్తుంది. ఇంట్రడక్టరీ ఆఫర్‌లో భాగంగా మూడు నెలలు లభిస్తుంది. ప్రొడక్టివిటీ కోసం ఆఫీస్‌ యాప్స్, ఔట్‌లుక్‌ ఇమెయిల్, వన్‌ డ్రైవ్, టీమ్స్‌తో మైక్రోసాఫ్ట్‌ 365 సాఫ్ట్‌వేర్‌ 2 లైసెన్సులు లభిస్తాయి. జియో అటెండెన్సు 10 లైసెన్సులు లభిస్తాయి. మార్కెటింగ్‌ కోసం జియో ఆన్ లైన్‌ బేసిక్‌ వెర్షన్‌ లభిస్తుంది.
    మొత్తంగా ఈ జియో స్మార్ట్‌ ఫోన్లు మార్కెట్‌లోకి రాగానే ఒక సంచలనాన్ని సృష్టించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

TOP STORIES

శ్రీరామ నవమి : రాముడి కంటే రామనామమే శక్తివంతమా?

శ్రీరాముడి కంటే ఆయన నామానికే ఎక్కువ శక్తి వుందని పలువురి భక్తుల విశ్వాసం. రామనామాన్ని ఎవరు జపిస్తారో వారికి అన్ని జయాలే అని విశ్వాసం. రామాయణంలో...