ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కు వచ్చిన ఇబ్బంది అంటూ ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా భవిష్యత్తులో మాత్రం ముఖ్యమంత్రి కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉండవచ్చు అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన విషయంలో దృష్టి పెట్టి పార్టీ వ్యవహారాల మీద దృష్టి పెట్టడం లేదనే భావన కూడా చాలా వరకు కూడా వ్యక్తమవుతుంది.
సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో పట్టుదలగా వెళుతున్న ముఖ్యమంత్రి జగన్ భవిష్యత్తులో కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు కూడా పార్టీపరంగా తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వచ్చే ఎన్నికల్లో కొంతమంది కీలక నేతలకు నియోజకవర్గాలను ముఖ్యమంత్రి జగన్ అప్పగించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఇప్పటికే స్పష్టత ఇవ్వడానికి జగన్ రెడీ అయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలను అలాగే పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పని చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ కొంతమందికి సూచనలు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సరిగా పనిచేయని ఎమ్మెల్యేలను పక్కన పెట్టడానికి కూడా ఇప్పుడు జగన్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఏ విధంగా ముందుకు అడుగు పడుతుంది ఏంటి అనేది చూడాలి.