రిలయన్స్‌ జియో మరో సంచలనం..ఇక అన్‌లిమిటెడ్‌ డేటా!

రిలయన్స్‌ జియో (Reliance jio) మరో సంచలన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి ఎలాంటి డైలీ డేటా లిమిట్‌ లేకపోవడంతో పాటు అధికంగా వ్యాలిడిటీ ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను ప్రకటించే టెలికాం దిగ్గజం జియో మరో సారి సరికొత్త ప్లాన్లను తీసుకువచ్చి తన ప్రత్యేకతను చాటింది. డైలీ డేటా లిమిట్‌తో ఇబ్బంది పడుతున్న వారికి శుభవార్త తెలిపింది. జియో ఫ్రీడం ప్లాన్‌ పేరుతో ఐదు కొత్త ప్లాన్లు అందుబాటులోకి తీసుకువచ్చింది.ఈ ప్లాన్‌ను ఎంచుకున్న కస్టమర్లకు ఎలాంటి డైలీ డేటా లిమిట్‌ ఉండదు. మొత్తం డేటా అయిపోయే అంతవరకు నిరంతరాయంగా వాడుకోవచ్చు.గడువు ముగిసే వరకు కూడా అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. ప్లాన్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 

  • రూ.127 ప్లాన్‌.. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకున్న కస్టమర్లకు 15 రోజుల వ్యాలిడిటీతో పాటు అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌ 12 జీబీ డేటా లభిస్తుంది. దీనికి ఎలాంటి డేటా లిమిట్‌ ఉండదు. 15 రోజుల పాటు ఈ డేటాను వినియోగించుకోవచ్చు. దీంతో పాటు జియో యాప్స్‌ కు ఉచితంగా సభ్యత్యం లభిస్తుంది.
  • జియో రూ.247 ప్లాన్‌తో రిఛార్జ్‌ చేసుకున్న వారికి 30 రోజుల వ్యాలిడిటీతో అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు 25 జీబీ డేటా లభిస్తుంది. డైలీ డేటా లిమిట్‌ ఉండదు. జియో యాప్స్‌ కూడా ఫ్రీ సబ్‌ స్క్రిప్షన్‌ లభిస్తుంది.
  • రూ.447 ప్లాన్‌.. ఇది 60 రోజుల వ్యాలిడిటీతో 50 జీబీ డేటా అందిస్తుంది. అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌ తో పాటు ఎలాంటి డేటా లిమిట్‌ ఉండదు.
  • రూ.597: ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ మూడు నెలలు ఉంటుంది. 75 జీబీ డేటాను వ్యాలిడిటీ ముగిసే వారకు ఎలాంటి డేటా లిమిట్‌ లేకుండా వాడుకోవచ్చు. అన్‌ లిమటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ సదుపాయం ఉంటుంది. జియో ఉచిత సబ్‌ స్క్రిప్షన్‌ ఉంటుంది.
  • రూ. 2,397 ప్లాన్‌తో కస్టమర్లకు ఎలాంటి డైలీ డేటా లిమిట్‌ లేకుండా 365 జీబీ డేటా లభిస్తుంది. వ్యాలిడిటీ 365 రోజులు. అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ తో పాటు జియో యాప్స్‌ కు ఉచితంగా సభ్యత్వం లభిస్తుంది.