ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్‌జీ.. కె42 పేరిట భారత్‌లో ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ను గతేడాది సెప్టెంబర్‌లోనే ప్రకటించింది. కానీ తాజాగా ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇందులో 6.62 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడు మరో 5 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంటుంది. డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్‌ను ఏర్పాటు చేశారు. మిలిటరీ గ్రేడ్ క్వాలిటీతో ఈ ఫోన్‌ను రూపొందించారు.
ఎల్‌జీ కె42 ఫీచర్లు…
* 6.6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్
* 64 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10
* 13, 5, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, గూగుల్ అసిస్టెంట్ బటన్
* మిలిటరీ గ్రేడ్ క్వాలిటీ, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఎల్‌జీ కె42 స్మార్ట్ ఫోన్ గ్రీన్, గ్రే కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌ను రూ.10,990 ధరకు ఈ నెల 26వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తారు. దీనిపై కస్టమర్లకు ఎల్‌జీ 2 ఏళ్ల వారంటీని అందిస్తోంది.